రాష్ట్రీయం

నేను ఓడితే రాజకీయ సన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ గెలిస్తే మంత్రి కేటీఆర్ ఆ పని చేస్తారా? అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్‌లో తాను ఓడిపోతున్నట్టు పరోక్షంగా కేటీఆర్ వ్యాఖ్యానించారని, ఆయన వ్యాఖ్యలను స్వీకరిస్తున్నానని, తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. మరి తనలాగా కేటీఆర్ కూడా రాజకీయ సన్యాసం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కొడంగల్‌లో తాను ఓడిపోతున్నట్టు కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారని, మరి గెలిస్తే తనలాగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. తనలాగా మాటకు కట్టుబడి ఉండకపోతే కేటీఆర్‌ది కల్వకుంట్ల వంశమేకాదని భావించాల్సి వస్తుందన్నారు. డిసెంబర్ 9వ తేదీకి తెలంగాణకు విడదీయరాని బంధం ఉందన్నారు. సోనియాగాంధీ జన్మదినం కూడా డిసెంబర్ 9వ తేదేనని, అదే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించబోతుందని, ఈ విజయాన్ని సోనియాగాంధీకి పుట్టిన రోజు కానుకగా ఇవ్వబోతున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణకు కేసీఆర్ రూపంలో పట్టిన పీడ, చీడ డిసెంబర్ 11న విరగడ అయిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకునే వారి ఓట్లను కుట్రపూరితంగా తొలగించారని రేవంత్ ఆరోపించారు. ఈ అంశంపై అనేకసార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. చివరికి ఓటర్ల తొలగింపు పట్ల ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ క్షమాపణ చెప్పడమంటే తమ వాదనతో ఆయన ఏకీభవించినట్టేనని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా ఓట్ల తొలగింపునకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

చిత్రం..కేసీఆర్‌కు రెండుచోట్ల ఓటు ఉందంటూ పత్రాలు చూపిస్తున్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి