రాష్ట్రీయం

దటీజ్ కేసీఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవ్వరూ గెలువలేదన్నారు. తెలంగాణలో కూడా ఇదే పునరావృతం కాబోతుందని టీఆర్‌ఎస్ వ్యతిరేకులు, ప్రత్యర్థి పార్టీల నేతలు, విశే్లషకులు కోడై కూశారు. కానీ దేశ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన సాహోసోపేత నాయకునిగా కే చంద్రశేఖరరావుచరిత్రను తిరగరాశారు. కేసీఆర్‌ను ఓడించడమే ఏకైక అజెండాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాకూటమి ఏర్పడింది. కూటమిలో ఇతర ప్రధాన పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి జతకట్టాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. అపర రాజకీయ చతురునిగా పేరుగాంచిన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా తన సర్వ శక్తులను ఒడ్డారు. కేసీఆర్ ప్రత్యర్థి రాజకీయ శిబిరానికి నాయకునిగా ఉండి కూటమిని ముందుకు నడిపారు. అయినా జరిగిందేమిటీ? కూటమిలో ప్రధాన రాజకీయ పక్షమైన టీడీపీకి చావుతప్పిలొట్టబోయిన చందంగా రెండే రెండు సీట్లు వచ్చాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాననే చంద్రబాబు తన పరువును తానే పొగొట్టుకున్నట్టు అయింది. మిగతా భాగస్వామ్య పక్షాలు సీపీఐ, టీజేసీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పేయి చావు దెబ్బతినాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చినప్పటికీ తమకు దక్కాల్సిన అధికార పీటాన్ని కేసీఆర్ హైజాక్ చేసుకెళ్లారని యుపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి వాపోయారు. సోనియాగాంధీయే స్వయంగా ఎన్నికల ప్రచారానికి రావడంతో ఇక కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్టేనని అన్నవాళ్లూ ఉన్నారు. దేశ భావి ప్రధానిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోన్న రాహుల్ గాంధీ సైతం పలుమార్లు ఎన్నికల సభలకు వచ్చి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. సోనియా, రాహుల్ ప్రచారం, వీరికి తోడైన చంద్రబాబు అర్థబలంతో గెలుపు ధీమాతో ఇక తెలంగాణలో అధికార పీఠం తమదేనన్నారు. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం అని కూటమి నేతలు ముహుర్తం కూడా పెట్టారు. ఎన్నికల ఫలితాలు కూటమి నేతలకు బిత్తరపోయేలా చేశాయి. అధికారం కాదు కదా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజాకూటమి తుడుచుపెట్టుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబపరమైందని ప్రజా సంఘాల నేతలు గద్దర్, మందకృష్ణ, ఆర్ కృష్ణయ్య వంటి నేతలు సైతం కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. వీరు చెప్పేది నిజమేనేమో అన్నంతగా ప్రజలు ఆయోమయానికి గురయ్యారని భావించారు. ఫలితంగా ప్రజలు కూటమి వైపుమొగ్గు చూపారేమోనన్నంతగా ప్రచారం జరిగింది. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆరోపణలు, విమర్శలపై ప్రజల స్పందన ఎక్కడా
బయటపడలేదు. కానీ వీరికి కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే ఓటుతో కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన ఆరోపణలపై కూడా ప్రజలు ఈ ఎన్నికల్లో మరోసారి సమాధానం చెప్పారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ 89 వేల మెజార్టీతో, మేనల్లుడు హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల రికార్డులను తిరగరాసి లక్షా 20 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కుమార్తె కవిత జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ఓడించి తండ్రికి గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబంపై ప్రత్యర్థుల ఆరోపణలను ప్రజలు తుత్తునియలుగా మార్చి నిరూపించారు. టీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని ప్రతిన చేసినా, కూటమి గెలిస్తే తామే సీఎం అభ్యర్థులమని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వంటి కాంగ్రెస్ హేమాహేమీల అడ్రసులు గల్లంతయ్యాయి. కొసమెరుపు ఏమిటంటే అమవాస్య రోజు ఎన్నికలు జరగడం వల్ల పాలకపక్షానికి ఓటమి తప్పదన్న జ్యోతిష్యుల జోస్యాన్ని కూడా తారుమారు చేసి, మిత్రపక్షానికి వదిలేసిన సీట్లు మినహాయించి పోటీ చేసిన 112లో దాదాపు 90 స్థానాల్లో విజయదుందుభి మోగించి ‘కేసీఆర్ మగాడ్రా బుజ్జి’ అని నిరూపించుకున్నారు. దటీజు కేసీఆర్!