రాష్ట్రీయం

తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18వ తేదీ తెల్లవారు జామున 12.30 నుంచి 2 గంటల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ తర్వాత స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈనెల 18, 19 తేదీల్లో ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ రెండు రోజుల్లో దాదాపు 1.70 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఎంబీసీ-26 వద్దగల గేటు ద్వారా భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోకి అనుమతిస్తామని, అవి నిండిన తరువాత వరుసగా నారాయణగిరి, ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపుతామన్నారు. ఆ తరువాత ఎన్1 గేటు ద్వారా మాడ వీధుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇక్కడ 32 వేల మంది భక్తులు కూర్చునే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ షెడ్లు కూడా నిండితే కల్యాణవేదిక వద్దకు, ఆ తరువాత నూతన సేవా సదన్ వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లలోకి భక్తులను పంపుతామన్నారు. షెడ్ల వద్ద తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తామని, మరుగుదొడ్ల వసతి కల్పించామన్నారు. వైకుంఠ ఏకాదశికి 80వేలు మందిని, ద్వాదశినాడు 90వేల మందికి స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉందన్నారు. భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా తమ తిరుమల యాత్రను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని సూచించారు.