క్రైమ్/లీగల్
నాయనమ్మలను నరికి చంపిన మనవడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 13 December 2018
పరిగి, డిసెంబర్ 12: నాయనమ్మలను సొంత మనవడు కొడవలితో నరికి హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పూడూరు మండలం చన్గోముల్ గ్రామానికి చెందిన శివకుమార్ ప్రతి రోజు తాగి వచ్చి ఇంట్లో నాయనమ్మలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. బుధవారం ఉదయం తాగిన మైకంలో నాయనమ్మ బుచ్చమ్మను, బాత్రూంలో ముఖం కడుగుతున్న చిన్న తాత భార్య చిన్న నాయనమ్మ అంతమ్మను కూడా కొడవలితో నరికాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన అంతమ్మను వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చన్గోముల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.