రాష్ట్రీయం

రాజ్యాంగ ఉల్లంఘనే బాక్సైట్ తవ్వకాలపై బృందాకారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం/చింతపల్లి, నవంబర్ 30: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ జోలికి వస్తే సహించబోమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాల అనుమతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సోమవారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అదే విధంగా ఏజెన్సీలోని చింతపల్లిలో జరిగిన బాక్సైట్ వ్యతిరేక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న ప్రధాని నరేంద్ర మోదీ, తమ్ముడు ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ విషయంలో దొంగాటలాడుతూ జిఓలు జారీ చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్‌పై జారీ చేసింది శే్వతపత్రం కాదని, అబద్దాల పత్రం అని ఎద్దేవా చేశారు. జెర్రెల 1,2,3,4 బ్లాక్‌ల్లో జనావాసాలు లేవని, వన్యప్రాణులు కూడా లేవని చంద్రబాబునాయుడు ఆ పత్రంలో పేర్కొన్నారన్నారు. బాక్సైట్ నిక్షేపాలు కలిగిన ప్రాంతంలో 247 గ్రామాలున్నాయని, వేలాది మంది గిరిజనులు నివాసం ఉన్నారని 1966 జనాభా లెక్కలు చెబుతున్నాయన్నారు. అక్కడ ఉంటున్న వారు మనుషుల్లా కనిపించటం లేదా అని ప్రశ్నించారు. జెర్రెల ప్రాంతంలో అటవీ భూముల సాగు హక్కు పత్రాలకోసం కేవలం 42 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పడం అబద్దమన్నారు. వేలాది మంది ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలు ఇవ్వాలని పోరాడుతుంటే దరఖాస్తులు రాలేదంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ సందపను గిరిజనేతరులకు అప్పగించడం చెల్లదనే.. ఎపి ఎండిసిని తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఈ విషయంలో గిరిజనుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనను రాష్టప్రతి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుండే బాక్సైట్ అనుమతులకు ఆదేశాలు జారీ అవుతున్నాయన్నారు. పోలీసు బలగాల సాయంతో బాక్సైట్ తవ్వకాలను జరపాలని ప్రభుత్వం యోచిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. గిరిజనుల సంపదను రక్షించుకునేందుకు గిరిజన ప్రాంత ప్రజలందరూ ఉద్యమించాలన్నారు. తవ్వకాల ఒప్పందాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఉద్ధృతంగా సాగిద్దామన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మిడియం బాబూరావు పాల్గొన్నారు.