మెయన్ ఫీచర్

‘కుటుంబ పార్టీల’ కదన కుతూహలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాజపా సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే ఫ్రంట్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లిస్ నేత ఓవైసీ రూపొందించే ఫెడరల్ ఫ్రంట్‌కు మధ్య ‘2019- సార్వత్రిక సమరం’ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కొనే్నళ్లుగా వరుస విజయాలతో ముందుకెళుతున్న భాజపాకు 2018 సంవత్సరం గట్టి ‘షాక్’ ఇచ్చింది. ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను విశే్లషించుకునే పనిలో భాజపా ఉంది. కాంగ్రెస్ పార్టీ తాజాగా హిందీ బెల్ట్‌లో లభించిన అపురూప విజయాలతో తిరిగి బలం పుంజుకొంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ఓట్లలెక్కింపునకు ఒక రోజు ముందే ఫెడరల్ ఫ్రంట్ రూపురేఖలపై చర్చించారు. మంత్రివర్గం ఏర్పాటు తర్వాత వచ్చే నెల నుంచి కేసీఆర్, ఒవైసీలు దేశవ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉంది.
ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదిస్తున్న కేసీఆర్, ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో కాంగ్రెస్‌తో జతకట్టిన తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వేదికపైకి వచ్చే అవకాశం లేదని స్పష్టమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే ఈ నేతల భవిష్యత్ రాజకీయాలెలా ఉంటాయన్నది తేలుతుంది. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. తెరాస అధినేత కలలు కంటున్న ఆ ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం మంచిదే. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తగ్గడం, నదీజలాలను సద్వినియోగం చేసుకోవడం, అధికారాల వికేంద్రీకరణ వంటివి జరగాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీలతో కొత్త ఫ్రంట్ ఏర్పడడం పగటికలే అని చాలామంది అపహాస్యం చేస్తున్నారు. కేసీఆర్ అందరూ వెళ్లేదారిలో వెళ్లరు. ఒక లక్ష్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసే స్వభావం ఆయనది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా, భాజపాలకు కోలుకోలేని దెబ్బ తగలడంతో కేసీఆర్ దూకుడు మరింతగా పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన వూహరచన చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ములాయం), బీఎస్పీ (మాయావతి), బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ (నితీష్), తమిళనాడులో డీఎంకే (స్టాలిన్), అన్నా డీఎంకే (పళనిస్వామి), పశ్చిమ బెంగాల్‌లోతృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ), కర్నాటకలో జేడీఎస్ (దేవెగౌడ), కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (్ఫరూక్ అబ్దుల్లా), ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (చంద్రబాబు నాయుడు), వైకాపా (వైఎస్ జగన్), జనసేన (పవన్ కల్యాణ్), ఉత్తరాదిన లోక్‌తాంత్రిక్ పార్టీ( శరద్‌యాదవ్), ఎల్‌జేఎస్ (రాంవిలాస్ పాశ్వాన్), ఆర్జేడీ ( లాలూప్రసాద్ యాదవ్)... ఇలా ఈ పార్టీలన్నీ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీలే. ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీని నడిపిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాంగ్రెస్, బీజేపీలపై 18 ఏళ్లుగా పోరాడుతున్నారు. తమిళనాడులో సినీనటులు రజనీకాంత్, కమల్ హాసన్ కొత్తగా పార్టీలను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో ఇంకా చిన్నాచితకా ద్రవిడ పార్టీలు చాలా ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలు కూడా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీల జాబితాలోకే వస్తాయి. ఈ పార్టీలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకతతో, ఆ పార్టీతో పోరాడి నిలదొక్కుకున్న పార్టీలే. ఈ పార్టీల వల్లనే కాంగ్రెస్ క్షీణించి పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితి దాపురించడానికి 50 ఏళ్లు పట్టింది. ఈ పార్టీలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో స్పష్టంగా చెప్పలేం. వీటికి స్పష్టమైన అజెండా ఉంటూ ఉండదు. స్థానికంగా తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు చేతులు కలుపుతుంటాయి. ఆ తర్వాత తమకు అధికారంలో దక్కాల్సిన వాటా లభించనప్పుడు, తమ ఉనికికి భంగం కలిగినప్పుడు కూటమి నుంచి నిష్క్రమిస్తుంటాయి. భాజపాకు గుడ్ బై చెప్పేటప్పుడు మతతత్వ శక్తులపై పోరాడేందుకు బయటకు వచ్చామని ఈ పార్టీల నేతలు గొప్పలు చెబుతుంటారు. కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకోవాలనేటప్పుడు అది నియంతృత్వ పార్టీ అని, కుటుంబ పార్టీ అని, చిన్న పార్టీలకు శత్రువని విమర్శిస్తారు.
భాజపాను మినహాయిస్తే దాదాపు అన్ని పార్టీలూ కుటుంబ పార్టీలే. సమాజ్‌వాదీ, జేడీయూ, జేడీఎస్ పార్టీలు రామ్‌మనోహర్ లోహియా ఆలోచనలు ప్రాతిపదికగా ఆవిర్భవించాయి. ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పోరాడి బలమైన శక్తిగా అవతరించాయి. బీఎస్పీ అంబేద్కర్ ఆశయాల సాధనకు, బహుజనుల సముద్ధరణ అనే లక్ష్యంతో ఆవిర్భవించింది. ఈ రెండు పార్టీలూ ముందు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడి, ఆ తర్వాత తమలో తాము పోట్లాడుకుని, మళ్లీ కాంగ్రెస్‌తో కలసి బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పోరాడి అధికారంలోకి వచ్చింది. ద్రవిడ పార్టీలు కూడా అంతే. కాంగ్రెస్‌కు తమిళనాడులో స్థానం లేకుండా చేశాయి. ఆ తర్వాత ద్రవిడ పార్టీలు చీలిపోయాయి. ఈ పార్టీలో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో తమిళ ప్రజలు పట్టం కడతారు. తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్‌లు ద్రవిడ పార్టీల్లో ఏదో ఒక పార్టీ వైపు చేరి ఎన్నికల్లో పోటీ చేస్తాయి.
వాజపేయి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన డీఎంకే పార్టీ ఈ రోజు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మమతా బెనర్జీ వెంటనే తిప్పికొట్టింది. కాంగ్రెస్ బలపడితే తమకు ముప్పువస్తుందనే ఆందోళన మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్‌లకు ఉంది. అందుకే వీరు బీజేపీని వ్యతిరేకిస్తూనే, కాంగ్రెస్ ఎదిగేందుకు సహకరించరు. రాహుల్ గనుక ప్రధానమంత్రి అయితే- యూపీ, బెంగాల్, బిహార్‌లలో బలంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, జేడీయూ పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోతాయి. అపుడు- ‘కాంగ్రెస్ వాదుల్లారా ఏకం కండి, అందరూ సొంత గూటికి వచ్చేయండి’ అనే నినాదం ఊపందుకుంటుంది. బీజేపీతో ఈ తరహా ప్రమాదం ఏ పార్టీలకూ లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలనుకుంటున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఎన్‌సీపీ, ద్రవిడ పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్, తెరాస, మజ్లిస్ వంటివి కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకూ ఈ పార్టీలో ప్రజాస్వామ్యం కనిపించదు. బీజేపీ కుటుంబ పార్టీ కాకపోయినా, వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీగా అవతరించింది. బీజేపీలో మోదీ ఆధిపత్యం వల్ల చాలా మంది నేతలు ‘స్వయం ప్రకాశక శక్తి’ని కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు బీజేపీలో చాలా మంది నేతలు తప్పనిసరిగా వౌనంగానే ఉంటారు. బీజేపీకి మెజార్టీ రానిపక్షంలో అపుడు ఆ పార్టీలో చాలామంది నేతలు నిరసన గళం విప్పుతారు. ఎన్‌డీఏ కూటమికి ఆధిక్యత లభించకుంటే మోదీకి పెద్ద సవాలే! మోదీకి ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ వంటి పేర్లు భాజపాలో వినిపించే అవకాశం లేకపోలేదు.
ఈరోజు మన దేశంలో వారసత్వ రాజకీయాలను విశే్లషిస్తే- కశ్మీర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ కుటుంబ పార్టీల పెత్తనమే కనపడుతుంది. ఈ పార్టీలు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాయే తప్ప, దేశ ప్రయోజనాలను పట్టించుకోవు. ఈ కుటుంబ పార్టీలు ప్రభుత్వంలో ఉంటే సంబంధిత సామాజిక వర్గాల మాటే చెల్లుబాటవుతుంది. కాగా, కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో ఎస్పీ, బీఎస్పీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు చేరే అవకాశాలున్నాయి. ఈ పార్టీలు మెజారిటీ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంటే కాంగ్రెస్, భాజపాలకు గడ్డు పరిస్థితి తప్పదు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఒడిశాలో బీజేడీకి బీజేపీ, కాంగ్రెస్, యూపీలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఎస్పీ,బీఎస్పీలకు శత్రువులే. ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇపుడు ములాయం, మాయావతి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరితే, ఏ మాత్రం ఆ పార్టీ నిలదొక్కుకున్నా- తమ ఉనికికి ప్రమాదం అన్న భయం ఎస్పీ, బీఎస్పీలను వెంటాడుతోంది.
కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా, ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్నా యూపీ, బిహార్‌లో కాంగ్రెస్ పాగా వేయాలి. ఎస్పీ, బిఎస్పీలను తన ఫ్రంట్‌లోకి తెచ్చుకోగలిగితే కేసీఆర్ వ్యూహం ఫలించినట్లే. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి మేలు చేసేందుకే అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా టీడీపీ బీజేపీతో అంటకాగింది. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి, తాజాగా కాంగ్రెస్‌తో జతకట్టింది. ఏపీలో ఈరోజు పునాదులు లేని కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించేందుకు టీడీపీ చురుగ్గా పావులు కదుపుతోంది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు జీవం పోసే పనులకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే- కేసీఆర్ సహజంగానే తెదేపా పట్ల ఆగ్రహం ప్రకటిస్తారు. చంద్రబాబు ఒకప్పుడు ఏ విధంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారో, కేసీఆర్ కూడా రాజకీయ చతురతతో కొత్త ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ‘ఇద్దరు చంద్రుల’ రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఫలిస్తాయో వచ్చే సార్వత్రిక సమరంలో తేలిపోతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే కూటమిలో కుటుంబ పార్టీలే భాగస్వాములుగా ఉంటా యి. కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలతో తలపడే యోధుడు మోదీ ఒక్కడే!

-కె.విజయ శైలేంద్ర 98499 98097