మెయన్ ఫీచర్

వృత్తివిద్యలో కోర్సును ఎన్నుకునే విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అమెరికా వైద్యవిద్యకు చాలా పటిష్టమైనదని కీర్తి వచ్చింది. అలా ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు ఏ మాత్రం విచారించకుండానే- వైద్య విద్యను కోరుకునే పిల్లల శ్రమే దీనికి కారణం అని చెప్పాలి. వైద్య విద్యను కోరే పిల్లలు నాలుగు దశల్లో పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. అవి.. 1. సాట్ స్కూల్ 2. స్కూలులో విద్యార్థి రికార్డు 3. వేసవిలో విద్యార్థి చేసే ఇంటర్న్‌షిప్ చేసిన విధానం, 4. విద్యార్థుల సామాజిక స్పృహ.
పైన చెప్పిన దాంట్లో ఇంటెర్నషిప్ ప్రభావం అత్యంత కీలకమట! చాలామంది విద్యార్థులు స్కూల్ సెలవుల్లోనే ఏ దవాఖానాలోనో సేవ చేస్తారు లేదా ఏ వృద్ధాశ్రమంలోనో పనిచేస్తారు. ఏ ఫార్మసీలోనో, కంపెనీల్లోనో పనిచేసి ఉంటారు. ఈ నేపథ్యం విద్యార్థి మెంటల్ మేకప్‌కు తోడ్పడుతుంది. హాస్పిటల్‌లో పనిచేస్తే లాభమేమిటి? విద్యార్థులు రోగి మానసిక స్థితితో మమేకవౌతారు. అది గొప్ప ప్రతిభ. రోగిపై సహానుభూతివేరు. రోగి బాధను పంచుకోవటం వేరు. అది ‘సింపతీ’ కాదు.. అది ‘ఎంపతీ’. అంటే రోగి బాధను పంచుకోవటం.
ఆ రోగానికి సంబంధించిన అంశాలను విచారిస్తే రోగికి కొంత సంతృప్తి కలుగుతుంది. రోగంలో వివిధ దశలుంటాయి. ఒక్కొక్క దశ రోగి మానసిక స్థితిపైన ప్రభావం చూపిస్తుంది. వైద్యంలో అభిరుచి ఉన్నవాడే గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతాడు. రోగిపై విద్యార్థులు చూపే ఈ పరామర్శ ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. రోగానికి సంబంధించి, రోగి అనుభవించే సమస్యలను విద్యార్థి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటాడు. రోగి నుంచి ఈ సమాచారాన్నంతా తీసుకుంటే ఆ విద్యార్థిపై రోగికి విశ్వాసం కలుగుతుంది. రోగం పూర్వ చరిత్రను ఈ విధంగా ప్రాక్టికల్‌గా అధ్యయనం చేస్తారు. కాబట్టి రోగికి ధైర్యాన్ని కలిగిస్తారు. ఈ జ్ఞానం, వైద్య విద్య చదువుతున్నప్పుడు విద్యార్థులు చూపే ఆసక్తి అమెరికా వైద్య విద్యకు బలం. దీనివల్ల విద్యార్థికి ఇది ఇష్టమైన చదువుగా మారుతుంది. ఇలాంటి నేపథ్యం ఉండడంతో వైద్య విద్య చాలా ప్రతిష్టగలది అయ్యింది. ప్రాథమిక విషయాలు పిల్లలకు తెలిసి ఉంటాయి కాబట్టి ఆ చదువు పరిశోధనకు ఉపయోగపడుతుంది.
ఇంటర్న్‌షిప్ ద్వారా, టెస్ట్‌మోనియల్స్ ద్వారా ఆ విద్యార్థి కెరీర్ నిర్ధారణ జరుగుతుంది. సామాజిక దృక్పథంలో వైద్య వృత్తిలోకి విద్యార్థి వస్తాడు. దేశంలో ఏ రోగాలున్నాయో, వాటివల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాల గురించి చెబుతాడు. యాక్సిడెంట్ల వల్ల వచ్చే నష్టం గురించి, ఆ ప్రభావాన్ని అంచనా వేస్తాడు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏయే రోగాలున్నాయో? చెప్పగలుగుతాడు. ఇంటెర్న్‌షిప్ అన్నది వైద్య విద్యకే ఊపిరి. అదే ఆక్సిజన్. కాబట్టి ఇష్టమున్న వారికి చదువు చెప్పటం అధ్యాపకులకు సులభమైపోతుంది. విద్యార్థి ఎన్నడు తరగతులకు గైర్హాజరు కాడు. వైద్య విద్యలో పరిశోధన బాగా జరుగుతుంది. వైద్య కళాశాలకు పరిశోధన వల్లనే పేరుప్రతిష్ఠలు వస్తాయి.
విద్యార్థులు చేసే ఇంటెర్న్‌షిప్‌నే వైద్య కళాశాలకు బలం. అదే విధంగా ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేసి వస్తారు. అలా చేయటం వల్ల కార్మికుల మనస్తత్వం తెలుస్తుంది. ఫ్యాక్టరీలో పనిచేసే వారు ప్రత్యేక దుస్తులు వేసుకుంటారు. వృత్తి కళాశాలల ప్రవేశంలో విద్యార్థి నేపథ్యం ఇంటర్న్‌షిప్‌లో బయట పడుతుంది.
(నా మనుమలు అభిజిత్, ఆనంద్‌లతో మాట్లాడాక)
***
జ్ఞానానికి సేంద్రియత...
ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను విద్యార్థులు మేధోమథనం చేస్తారు. నేను నెల రోజుల క్రితం తరగతి గదిలో పైథాగరస్ సిద్ధాంతానికి ఒక రకమైన నిరూపణ ఇచ్చాను. కానీ ఈనాడు తరగతి గదిలో ఉన్న తెలివిగల విద్యార్థి ఆ పాఠాన్ని ఆధారం చేసుకుని అదే పైథాగరస్ సిద్ధాంతానికి మరొక నిరూపణ ఇచ్చాడు. మేధోపరమైన కార్యక్రమం కొత్త మేధస్సును ఉత్పత్తి చేస్తుంది. చెట్టు పెరిగిన కొద్దీ కొత్త మొలకలొస్తాయి. అదే మాదిరిగా జ్ఞానానికి కూడా సేంద్రియ (ఆర్గానిక్) లక్షణం ఉంటుంది. ప్రతిజ్ఞానం కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తుంది. మనం ఒక పాఠాన్ని వచనంలో చెబితే అదే జ్ఞానాన్ని విద్యార్థి పద్యంలో చెబుతాడు. లేక కథాపూర్వకంగా చెబుతాడు. ఇది తెలివిగల పిల్లల మేధోపరమైన లక్షణం. మార్క్స్ 150 సంవత్సరాల క్రితం చెప్పిన సిద్ధాంతాన్ని ఎంతోమంది ఈనాడు సమీక్ష చేస్తూ పునర్విమర్శిస్తున్నారు కదా! ఒక పెట్టుబడి నుంచి 21వ శతాబ్దం వచ్చేసరికి 10 క్యాపిటల్స్ పుట్టాయి. ద్రవ్యానికి సేంద్రియ లక్షణం ఉందని మార్క్స్ చెప్పాడు. జ్ఞానం జ్ఞానాన్ని కూడా సృష్టిస్తుంది. అది తరగతి గదిలో చురుకైన విద్యార్థి చేసే పని. జ్ఞానం నిశ్చలమైనది కాదు. జ్ఞానం పెరగటానికి కారణమది. అందుకు కొత్త మేధస్సే కారణం. ఉపాధ్యాయుడు నిప్పురవ్వలను సృష్టిస్తే విద్యార్థి దాన్ని జ్వాలగా మార్చుతాడు. అది తరగతి గది మేధస్సు లక్షణం. కాబట్టే కొన్ని స్కూళ్లు జ్ఞాన ఉత్పత్తి కేంద్రాలవుతాయి.
మూల్యాంకనం ఒక వంతెన...
ఉపాధ్యాయుడు కేవలం పిల్లలనే మూల్యాంకనం చేయడు. తన బోధనను కూడా మూల్యాంకనం చేసుకోవాలి. తాను పాఠం చెబుతున్నప్పుడు విషయ సంగ్రహణను ఏ పుస్తకాల నుంచి తీసుకున్నాడో బేరీజు వేసుకోవాలి. కేవలం ప్రభుత్వం ఇచ్చిన పాఠ్య పుస్తకాలను చదివితే సరిపోతుందా? లేక వేరే ఏమైనా పుస్తకాలు దానికి సంబంధించినవి చదవాల్సిన అవసరం ఉందా? అని ఎసెస్‌మెంట్ చేసుకోవలసిన అవసరం ఉంది. ఇతర పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉన్నదా? అని ఆలోచించుకునే సదావకాశం అది. తన టీచింగ్‌లో ఏమైనా తప్పులు దొర్లాయా? దాన్ని కూడా సరిచేసుకోవాలి. మొత్తం మీద తన టీచింగ్‌ను మార్చుకోవాలా? ఎలా కొనసాగించాలి? అన్న దానిపై ఉపాధ్యాయుడు తనకు తాను మూల్యాంకనం చేసుకోవాలి. ప్రతి మూల్యాంకనం ఒక వంతెన లాంటిది. దీన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు అంతగా ఎదుగుతారు. తనను తాను సంస్కరించుకునే అవకాశం టీచర్‌కు లభిస్తుంది. మార్కులు వేసి సంతోషపడితే విద్యార్థులు జ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతారు. కాబట్టి అసెస్‌మెంట్ లెర్నింగ్‌కు ఎంత ముఖ్యమో టీచింగ్‌కు కూడా అంతే ముఖ్యం.

-చుక్కా రామయ్య