అదిలాబాద్

గ్రామాల్లో యాక్షన్ టీమ్ సంచారం...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఏప్రిల్ 5: బెల్లంపల్లి నియెజకవర్గ కేంద్రమైన నెనె్నల, వేమనపల్లి, తిర్యాణి, దేవాపూర్ అటవీ ప్రాంతాలతో పాటు బెల్లంపల్లి మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నట్లు సమాచారం. మళ్లీ మావోయిస్టులు బలపడే ప్రయత్నాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమ కార్యకలాపాలను బలపరుచుకునేందుకు రిక్రూట్‌మెంట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషితో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం మావోల కదలికలపై నిఘా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గ్రామాల మండలాల సరిహద్దు గ్రామాలైన దుగ్నెపల్లి, బొప్పారం, పెర్కపల్లి శివారులో గల పడమల్లవాగు వద్ద ముగ్గురు యాక్షన్ టీమ్ సభ్యులు రిక్రూట్‌మెంట్ చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలుస్తోంది. పెర్కపల్లి గ్రామ సరిహద్దులోని రైతుల పొలం వద్ద అన్నం తిని వెళ్లినట్లు సమాచారం. పెర్కపల్లి గ్రామ సరిహద్దులో కొంత మందిని స్థానిక సర్పంచ్‌పై వివరాలు సేకరించి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మావోల కదలికలపై గత కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ నెనె్నల మండలంలో పర్యటించారు. ఈ సంఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు నాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా మావోల సంచారంతో అటవీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి.