ఆంధ్రప్రదేశ్‌

10 శాతం కోటా రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 21 : అగ్ర వర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని రాజ్యాంగంలో పేర్కొంటే, అదనపు రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే ఈ సవరణ తీసుకువచ్చారని మండిపడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ పెంచేందుకు చట్టాన్ని ఎందుకు సవరించలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అయినా ఎస్సీ వర్గీకరణ బిల్లును చర్చకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.