ఆంధ్రప్రదేశ్‌

రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 21: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభానికి మంగళవారం తెరపడే అవకాశాలున్నాయి. అమరావతిలో సీఎం సమక్షంలో జరిగే కీలక సమావేశంలో రాజంపేట అసెంబ్లీ ఇంచార్జిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని వీడుతున్నారన్న వార్తల నేపధ్యంలో మంగళవారం జరుగనున్న సమావేశం కీలకం కానుంది. అమరావతిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రాజంపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జిని ప్రకటించే అవకాశాలున్నాయి. సీనియర్ నాయకుడు, రెండుసార్లు శాసనసభకు ఎన్నికై, మంత్రిగా పనిచేసిన పసుపులేటి బ్రహ్మయ్యను తాత్కాలిక ఇన్‌ఛార్జిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుత శాసనసభ్యులు, విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఆదివారం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించాలని భావించినా చివరి నిమిషంలో వాయిదా వేసుకుని ముఖ్యమంత్రిని కలిసిన తరువాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం రాజంపేట రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులు, చేర్పుల దృష్ట్యా మేడా వెంకట మల్లికార్జునరెడ్డి సీఎంను కలుస్తారా లేదా అన్నది అంతుపట్టడం లేదు. అయితే టీడీపీలో మేడా వెంకట మల్లికార్జునరెడ్డి కొనసాగే పరిస్థితులు దాదాపు మృగ్యంగా కనిపిస్తున్నందున రేపో మాపో రాజీనామా సమర్పించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకు భావన. అయితే సీఎం అధ్యక్షతన మంగళవారం జరిగే నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి హాజరవుతారా లేదా అన్న దానిపై ఆయన రాజీనామా సమర్పించే అంశం ఆధారపడి ఉంటుంది.
కాగా రానున్న ఎన్నికల్లో రాజంపేట తెలుగుదేశం పార్టీ టికెట్ క్షత్రియులు లేదా బలిజలకు కేటాయించాలన్న నిర్ణయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ రెండు సామాజికవర్గాల నుండే అభ్యర్థిత్వాల ఎంపిక జరపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం కోసం సోమవారం భారీగా ఆ పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. పార్టీ మారతారన్న ఆరోపణలు, జిల్లా టీడీపీ నేతలకు, మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి మధ్య సాగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు నేపధ్యంలో ప్రస్తుత శాసనసభ్యుడు మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి పార్టీకి దూరం అమాంతం పెరిగిపోవడంతో రాజంపేట టీడీపీ టికెట్ రేసులోకి క్షత్రియ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు రావడం మొదలెత్తారు. రాజు విద్యాసంస్థల అధినేత చమర్తి జగన్మోహన్‌రాజు అమరావతిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి టీడీ జనార్ధన్‌ని సోమవారం కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరారు. అలాగే రెడ్‌బస్ యాప్ సహ వ్యవస్థాపకుడు చరణ్‌రాజ్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను కలిసి తన అభ్యర్థిత్వం పరిశీలించమని కోరినట్టు తెలుస్తోంది. రాజంపేట బార్ అసోసియేషన్‌కు చెందిన కె.శరత్‌కుమార్‌రాజు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి బలిజ సామాజికవర్గం అభ్యర్థిత్వాలకు రాజంపేట నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. 1985లో స్వర్గీయ బండారు రత్నసభాపతి, 1994, 1999 ఎన్నికల్లో పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా బలిజ సామాజికవర్గం నుండి అభ్యర్థిత్వాలు కోరుతున్న నేతలున్నందున వీరి పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలించి తగు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.