విలన్‌గా వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీజే చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ చిత్రం తరువాత దిల్‌రాజు బ్యానర్‌లో దాగుడుమూతలు అనే చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించాడు కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్క్‌అవుట్ కాలేదు. ఇక ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన జిగర్తండా చిత్రాన్ని హరీష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించనుండగా నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.