వేగంగా సూర్యాస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండి సరోజ్‌కుమార్ హీరోగా చేస్తున్న చిత్రం సూర్యాస్తమయం. చిత్రమేమంటే ఆయనే -కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం, యాక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుటల్, రవికుమార్ సుదర్శి నిర్మించిన ‘సూర్యాస్తమయం’ తొలి కాపీ సిద్ధమైంది. ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బండి సరోజ్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ‘ఉరిమే మేఘం స్నేహం/ కురిసే వర్షం స్నేహం’ పాటకు మంచి స్పందన వచ్చిందన్నారు. స్నేహంపై రాసిన పాట, సమకూర్చిన బాణీకి గాయకుడు శ్రీకర్ జొన్నలగడ్డ న్యాయం చేశారని, ఆయన గాత్రంలో పాట వినసొంపుగా ఉందన్నారు. సూర్యాస్తమయం చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని, సహజసిద్ధమైన లొకేషన్లలో ఆర్టిస్టులకు మేకప్‌లేకుండా నేచురల్‌గా తెరకెక్కించామన్నారు. ఒక పోలీస్‌కి, గ్యాంగ్‌స్టర్‌కీ మధ్య జరిగే అంతర్యుద్ధమే సినిమా ప్రధానాంశమని, గ్యాంగ్‌స్టర్ పాత్రను త్రిశూల్ రుద్ర చేశారన్నారు. త్వరలో ట్రైలర్ విడుదల చేసి, ఫిబ్రవరి రెండోవారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.