క్రైమ్/లీగల్

చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను విచారించాల్సి ఉన్నందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును కోరాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ముం దస్తు బెయిల్ పిటిషన్ విచారిస్తున్న న్యాయమూర్తి ఎదుట సీబీఐ,ఈడీ తమ వాదన వినిపించాయి. ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకునే వరకూ ఆయనను అరెస్టు చేయకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని న్యాయమూర్తి సునీల్ గౌర్ స్పష్టం చేశారు. బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ, ఈడీ తరఫు న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మాజీ మంత్రి చిదంబరం విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దర్యాప్తు సంస్థ ల ప్రశ్నకలు సమాధానం చెప్పాల్సి ఉంటుందనే బెయి ల్ ప్రయత్నాలు చేస్తున్నారని తుషార్ ఆరోపించారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని న్యాయమూర్తిని కోరారు. కాంగ్రెస్ నేతను చట్టబద్ధంగానే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారని ఆయన అన్నారు. చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ మాట్లాడుతూ ‘2018 జూన్‌లో చిదంబరంను సీబీఐ ఒక్కసారి మాత్రం ప్రశ్నించింది. ఐఎన్‌ఎక్స్ కుంభకోణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరేలేదు’అని కోర్టు దృష్టికి తెచ్చారు.
పైగా ఐదుగురు వ్యక్తులపై అభియోగాలు నమోదుకాగా, నలుగురిగి బెయిల్ మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి చిదంబరం సహకరిస్తున్నారని సిబాల్ తెలిపారు. కాగా చిదంబరంను ఈనెల 24 వరకూ అరెస్టు చేయవద్దని గతంలో ఇచ్చిన గడువును హైకోర్టు పొడిగించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ 3500 కోట్లు, ఐఎన్‌ఎక్స్ 305 కోట్ల రూపాయల కుంభకోణం కేసుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.