క్రైమ్/లీగల్

తూ.గో.లో పేలిన వెల్డింగ్ సిలిండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, జనవరి 29: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామ శివార్లలోని సూర్యశ్రీ రైస్‌మిల్లులో మంగళవారం వెల్డింగ్ చేస్తున్న సమయంలోపడిన నిప్పురవ్వల కారణంగా చెలరేగిన మంటలతో సిలెండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన జిల్లా కేంద్రం కాకినాడ తరలించారు. ఈ ప్రమాదంలో మిల్లు షెడ్డు సగం కూలిపోయింది. వివరాలిలావున్నాయి... రైసు మిల్లు షెడ్డుకు ఉన్న ఇనుప కమ్మిలు తుప్పు పట్టడంతో వాటిని శుభ్రంచేసి, వెల్డింగ్ చేసే కార్యక్రమం మంగళవారం ఐదుగురు వ్యక్తులు చేపట్టారు. 30 అడుగుల ఎత్తున్న షెడ్డు ఇనుప కమ్మిలు వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు కింద ఉన్న తవుడు, చిరు నూకల్లో పడటంతో మంటలు రేగాయి. దీనితో ఆ సమీపంలో ఉన్న వెల్డింగ్ చేయడానికి ఉపయోగించే సిలెండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి మిల్లు షెడ్డు పైకప్పు కొద్ది భాగం కూలిపోయింది. షెడ్డుపైన వెల్డింగ్ పనుల్లో ఉన్న వాసంశెట్టి గంగాధర్, పాకా పృథ్వీరాజ్‌ను మంటలు చుట్టుముట్టాయి. దీనితో వారిద్దరు కిందకు దూకేశారు. దీనితో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి సహాయకులుగా వచ్చిన శ్రీను, కుక్కల నాగరాజు కూడా మంటల ధాటికి గాయపడ్డారు. గాయపడ్డ నలుగురిని హుటాహుటిన అనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గంగాధర్, పృథ్వీరాజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రం కాకినాడ తరలించారు. సమాచారం అందుకున్న అనపర్తి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మిల్లు వద్దకు చేరుకుని మంటలను అదుపుచేశారు. అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్, ఎస్సై రజనీకుమార్ అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల నుండి వాంగ్మూలాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.