క్రైమ్/లీగల్

మేఘాలయ చర్చిలో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తురా(మేఘాలయ), జనవరి 30: గుర్తు తెలియని దుండగులు చర్చిలోని ఇద్దరు సీనియర్ క్రైస్తవ మత గురువులపై దాడిచేసి గాయపరచడంతోబాటు సుమారు లక్ష రూపాయల నగదు తస్కరించి పరారైన ఘటన మేఘాలయలోని వెస్ట్‌గ్యారోహిల్స్ జిల్లాలో బుధవారం తెల్లవారు ఝామున చోటుచేసుకుంది. ఓ సీనియర్ పోలీసు అధికారి కథనం మేరకు గత నెల రోజుల వ్యవధిలో ఈప్రాంతంలోని చర్చిల వద్ద ఇలాంటి నాలుగు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకే గ్యాంగ్ ఈ దోపిడీలన్నింటికీ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు రాత్రి 1గంట ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఇరవై మంది దుండగులు ఇక్కడి డామినిక్ సావియో మిషన్ భవనంలోకి చొరబడ్డారు. మత గురువులు రెవరెంట్ ఎఫ్‌ఆర్ థామస్ జాన్, డేనియల్ ఎం. సంగ్మాలను తాళ్లతో బంధించి ఇనుప రాడ్లతో చితక బాదారు. తర్వాత చర్చిలో విధ్వంసానికి పాల్పడి సుమారు 1.25 లక్షల రూపాయల విలువైన నగదు, రెండు స్మార్ట్ ఫోన్లు తీసుకుని పరారయ్యారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎంజీఆర్ కుమార్ విలేఖరులకు తెలిపారు. ఈఘటనపై డామ్నిక్ సేవియో మిషన్ అధినేత, మత గురువు జాన్ మాథియాస్ ఎం మరాక్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చూస్తుండగానే దుండగులు చర్చి అలారమ్ వద్ద సైతం అడ్డుగా నిలిచి ఘాతుకాలకు పాల్పడి పరారయ్యారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఈస్ట్‌గారోహిల్స్ ప్రాంతంలోని దావగ్రే వద్ద, సౌత్‌గారో హిల్స్ ప్రాంతంలోని చోక్‌పోట్, పశ్చిమ ప్రాంతంలోని దాలూ వద్ద గతంలో చోటుచేసుకున్న దోపిడీ ఘటనల్లాగే ఇవీ ఉన్నాయని ఎస్పీ కుమార్ తెలిపారు. దుండుగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.