క్రైమ్/లీగల్

30 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఫిబ్రవరి 8: పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సీ.శ్రీనివాస్ నేతృత్వంలో దాడులు చేసి పట్టుకున్నారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.నవీన్‌కుమార్ కథనం ప్రకారం అప్పర్ ధూల్‌పేట్ గాంధీబైటక్ ప్రాంతానికి చెందిన ధన్ను సింగ్ కుమారుడు దీపక్ సింగ్(20), ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించి 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దాడులు జరిగే సమయంలో దీపక్ సింగ్ సోదరి సూమన్‌బాయి(24) పారిపోయింది.
ఒరిస్సా ప్రాంతానికి సూమన్‌బాయి.. అక్కడ ముగ్గురి వ్యక్తులతో కలిసి గంజాయిని కనుగోలు చేసింది. ఒరిస్సా ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం సాయంత్రం ఫిల్‌ఖానా ప్రాంతంలోని ధనలక్ష్మీ ట్రాన్స్‌ఫోర్ట్స్‌లో అప్పగించి వెళ్లారు. అక్కడి నుంచి మూడు పెద్ద సంచులలో మోటర్ సైకిల్‌పై ఇంటికి గంజాయిని తరలించారు. దాడులలో 15 ప్లాస్టిక్ కవర్లు ఉన్న గంజాయి రెండు కిలోల చొప్పున 30 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. దీపక్ సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ తెలిపారు.

పోలీసుల అదుపులో వైద్యులు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8: నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ ప్రైవేటు స్కానింగ్ కేంద్రంపై పోలీసులు, షీటీమ్ ప్రత్యేక బృందం దాడి చేసి వైద్యులను అదుపులోకి తీసుకొని స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి షీటీమ్ డీసీపీ సలేమా, ఇబ్రహీంపట్నం సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం ఇబ్రహీంపట్నంలోని ప్రత్యూష స్కానింగ్ కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గతంలోనే పోలీసులు దాడులు నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ నందకిషోర్‌తో పాటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు వివరించారు. డీఎంహెచ్‌ఓ సమక్షంలో పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మధులికకు శిఖాగోయల్ పరామర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రెమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. ఈ విషయాన్ని యశోదా ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. 48 గంటల వైద్యుల శ్రమ ఫలితంగా మధులిక ఆరోగ్యం మెరుగు పడిందని యశోద ఆసుపత్రి సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు.
సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్యుల బృందం నాలుగు సర్జరీలు చేసిన అనంతరం మధులిక పూర్తిగా కోలుకుందని చెప్పారు. డాక్టర్లు అడిగినదానికి మధులిక సైగలు చేస్తోందని అన్నారు. బ్రెయిన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశామని, ప్రస్తుతం మధులిక ఆరోగ్యం కుదట పడిందని విజయ్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శిఖాగోయల్ పరామర్శించారు. కౌనె్సలింగ్ కోసం మాత్రమే వాళ్లు షీటీమ్‌ను సంప్రదించారని, ఆ తర్వాత అబ్బాయి మళ్లీ అమ్మాయిని కలువలేదని అదనపు సీపీ తెలిపారు.