ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌టీఆర్ ఓ దార్శనికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్రవేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఓ దార్శనికుడని, భావితరాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు.
ఉండవల్లి ప్రజావేదికలో శనివారం సాయం త్రం వరంగల్, చల్లపల్లి ఎన్‌టీఆర్ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఓ వ్యక్తికాదు..వ్యవస్థ అని అభివర్ణించారు. మన కోసం త్యాగాలు చేసిన వారిని మరచిపోవటం మంచి పద్ధతి కాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాక వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత గుర్తెరగాలని హితవు పలికారు. కన్నతల్లిని విస్మరించే దుస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే మాతృమూర్తికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. గొప్పవాళ్లు ఒకప్పుడు చిన్నవాళ్లే అని, పుట్టుకతో ఏదీ సంక్రమించదని చెప్తూ సాధన ద్వారానే అన్నీ సాధించుకోగలమని ఉద్ఘాటించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తుల జీవితాలను ఆధ్యయనం చేయాలన్నారు. పట్టుదల..క్రమశిక్షణే విజయ సోపానాలని, ట్రస్ట్‌లో చదువుకునే ప్రతి విద్యార్థి స్థిరపడ్డాక మరొకరిని ఆదుకోవాలన్నారు. కనీసం నలుగురి భాగస్వామ్యంతో ఆ బాధ్యత పంచుకోవాలని పిలుపునిచ్చారు. భువనేశ్వరి ఒక పని చేపడితే సాధించి తీరతారని అదే ఆమె విజయ రహస్యమని వివరించారు. 24 గంటలూ సెల్‌ఫోన్‌కు బానిసైతే జీవితం ఫినిష్ అని హెచ్చరించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయరాదన్నారు. సంకల్పం..సాధన ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. భవిష్యత్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు. భువనేశ్వరి మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. అంతా భూమీద సమాన హక్కులతో జన్మించామని, కోపం..ఆవేశం పక్కదారి పట్టించేందుకు ఆజ్యం పోస్తాయన్నారు. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలన్నారు. ఏకాగ్రత మనలో నిబిడీకృతమైన శక్తుల్ని వెలికి తెస్తుందన్నారు. విద్య భుక్తికి మాత్రమే కాదని జ్ఞాన సముపార్జన కోసమన్నారు. ప్రతి ఒక్కరూ ఆశావహ దృక్పథాన్ని అలవరచు కోవాలన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గండిపేట, వరంగల్, చల్లపల్లి నుంచి వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరయ్యారు.
చిత్రాలు.. ఎన్టీఆర్ మోడల్ స్యూల్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,
*ఎన్టీఆర్ మోడల్ స్యూల్ విద్యార్థినులతో సీఎం దంపతులు