ఆంధ్రప్రదేశ్‌

జిల్లా ఆసుపత్రిగా పాడేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఫిబ్రవరి 10: అన్ని రకాలు వైద్య పరికరాలు, విభాగాల కల్పన ద్వారా జిల్లా స్థాయి ఆసుపత్రిగా పాడేరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య శాఖామంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ వెల్లడించారు. గిరిజన ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పాడేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కిడారి తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో కోటి ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన గిరిజన బాలల సత్వర చికిత్సా కేంద్రం, క్షయ నిర్థారణ, సిటీస్కాన్ యంత్ర పరికరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పాడేరు ఆసుపత్రిలో వంద పడకల నుంచి రెండు వందల పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని చెప్పారు. విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి గిరిజన ప్రాంత రోగులను తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని, దీనిని నివారించి ఎటువంటి దానికైనా ఈ ఆసుపత్రిలోనే చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.