మెయిన్ ఫీచర్

స్ర్తి ప్రాధాన్యం మరువలేనిది-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహం మరియు సంతానం
విడాకులు తీసుకునే పక్షంలో బిడ్డల బాధ్యత తండ్రికే దొరుకుతుంది. ఎందుకంటే వివాహ సమయంలో దాని గురించి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం తల్లి తన బిడ్డలకి దూరంకావాల్సి వస్తుంది. స్ర్తీలను గౌరవించేది ఇలాగేనా ? జంతు ప్రపంచంలో అవసరమైతే తన బిడ్డల కోసం ప్రాణాలకైనా తెగించి పోరాడడానికి తల్లి సిద్ధంగా ఉంటుంది. అంతే గాని తన బిడ్డలని వదులుకోదు.
నియంత్రణ మరియు అవినీతి
ఆధ్యాత్మికత పేరిట మనస్సును కలుషితం చేస్తున్నారని మహాత్మా గాంధీ యొక్క ఆందోళన మరియు బాధ తరువాయి భాగంలో ఇవ్వబడిన ఆయన అభిప్రాయా లలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ప్రాపంచిక వస్తు విషయాలు మనస్సులను కలుషితం చేస్తాయి. కలుషితమైన మనస్సు నిజాన్ని ఎప్పుడూ చూడలేదు.
వారి సంఖ్య అనుసరించి ప్రధానమైన మతాలు తమ అనుచరులకు ద్వంద ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఆధ్యాత్మిక మార్గదర్శం కాకుండా ఇది ఒక రాజకీయ పాఠంలాఉంటుంది. పొరుగు దేశాలలో మరియు ఇతరత్రా ప్రదేశాలలో అల్ప సంఖ్యాకుల హక్కులను పరిశీలిస్తే ఆధ్యాత్మికత యొక్క తెర వెనుక ఉన్న రహస్యాన్ని అవి బయటపడతాయి.
మతాన్ని వదిలివేయదల్చుకున్న వారికి శిక్ష మృత్యు దండనమే. వీరికి ‘‘వాక్స్వాతంత్య్రము’’ అంటే ఏమిటో అర్థవౌతుందా ?
ప్రధానమైన సందర్భాలలో స్ర్తీల పాత్ర
పెండ్లి మరియు ఉపనయనం లాంటి ప్రధానమైన సందర్భాలలో పురుషుడు, భార్య తప్పక పాల్గొనవలెను. ఒక వేళ స్ర్తీ అలా పాల్గొనలేకపోయినా లేక మరణించినా తల్లిదండ్రుల స్థానంలో బంధువులు లేక స్నేహితులు వారి భార్యలతో కలసి ఆ వేడుక నిర్వహిస్తారు. ఇది సమాజంలో స్ర్తీ ప్రాధాన్యతని స్పష్టముగా తెలియజేస్తున్నది. తమ పిల్లలు తమ స్వంతమేనన్న భావన తల్లిదండ్రులకు ఉండరాదన్న అంతర్లీన సూత్రాన్ని ఇది సూచిస్తోంది. ఈ సూత్రాలు సమాజానికి విశేషమైన మేలు జరగాలనే ఏర్పడ్డాయి. స్ర్తీ పరోక్షములో పురుషుడు తన సంతానం యొక్క వివాహం నిర్వహించడానికి అనర్హుడు. ఇతర మతాలలో పురుషుడే వేడుకలలో ప్రధాన కర్త. పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నపుడు, ఉత్సవ ఆరాధనలలో పై సూత్రం అన్వయిస్తుంది. వేద జ్ఞానానికి ప్రతినిధి దేవత గాయత్రిదేవి.
యజ్ఞం సాధారణముగా బహిరంగ వేడుకగా జరిగేది, ప్రజశ్రేయస్సుకై లేక దీవెనలకై దేవతలను సంతృప్తి పరచడానికి విధివిధానముతో పూజిస్తారు. ఇటువంటి విధులలో పురుషులు, స్ర్తీలు కలిసి తప్పక పాల్గొనాలి. చాలా మతాలలో ప్రార్ధనా ప్రదేశాలలో స్ర్తీలు పురుషుల నుంచి వేరుచేయబడతారు.
సమాంతర బంధువులతో
వివాహం
స్వలింగ తోబుట్టువుల యొక్క సంతానం ‘సమాంతర బంధువు’ వ్యతిరేక లింగ తోబుట్టువుల సంతానం ‘క్రాస్ బంధువు’ అంటే, ఒక వ్యక్తి తన తల్లి సోదరుని కుమారైను వివాహం చేసుకుంటే అతను ఒక క్రాస్ బంధువుని వివాహం చేసుకుంటున్నాడు. మరో వైపు, ఒక వ్యక్తి తన తండ్రి సోదరుడు కుమారైను వివాహం చేసుకుంటే, అతను తన సమాంతర బంధువుని వివాహం చేసుకుంటున్నాడు.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562