క్రైమ్/లీగల్

వేట ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 15: ‘వేట’ అనే పేరుతో ఓ ముఠాగా ఏర్పడి గంజాయి సేవిస్తూ ప్రతి నిత్యం అక్రమ సంబంధాలు కలిగిన జంటలపై దాడులు చేస్తూ వారినుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటూ సదరు మహిళలపై అఘాయిత్యం చేస్తున్న ముఠాను సూళ్లూరుపేట సీ ఐ యన్ కిషోర్‌బాబు, తడ ఎస్సై దాసరి వెంకటేశ్వర్లు చాకచక్యంగా శుక్రవారం పట్టుకున్నారు. వీరి నుంచి 5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐదుగురు సభ్యుల ముఠాను కోర్టుకు హాజరుపరిచారు. నెల్లూరు జిల్లా తడ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సూళ్లూరుపేటకు చెందిన పాల వినయ్, విన్నమాల శ్రావణ్‌బాబు, దామర సాయికుమార్, డమ్మాయి సునీల్‌కుమార్, టెంకాయల రాజేష్ అలియాస్ అజయ్ వీరొక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు ‘వేట’ అని పేరు పెట్టుకుని ప్రతి నిత్యం గంజాయి, మద్యం సేవిస్తూ సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని పరిశ్రమలకు వెళ్లే వారిపై , అక్రమ సంబంధాలు కలిగి తడ మండలంలోని కొణ్ణంబట్టు, మాంబట్టు అడవుల్లో సంచరిస్తున్న ఆ జంటలను బెదిరించి, పురుషులను కొట్టి, మహిళలను బలవంతంగా అనుభవించేవారని దీంతోపాటు వారివద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు లాక్కుని వెళుతుండేవారమని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. అంతే కాకుండా 2018 ఫిబ్రవరి నెలలో ఈ నిందితులు గంజాయిని పెంచి పణ్ణంగాడు గ్రామం జాతీయరహదారి పక్కన ఆగివున్న లారీ క్యాబిన్‌లోకి దూరి ఉంగరం ఇవ్వమని డ్రైవర్‌పై కత్తితో దాడి చేసినట్లు చుట్టుపక్కల వారు రాగా అక్కడి నుంచి ఐదుగురు పరారైనట్లుగా నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలో సదరు ‘వేట’ముఠా దాదాపుగా 30 మంది మహిళలపై అఘాయిత్యం చేసి పురుషులను దాడి చేసినట్లుగా ఈ ముఠా ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు.
ఈ నేపధ్యంలో పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో అక్కం పేట రైల్వేస్టేషన్ సమీపంలో పొదల్లో గంజాయి సేవిస్తూ ఉండగా సూళ్లూరుపేట సీఐ ఎన్ కిషోర్‌బాబు, తడ ఎస్సై జి వెంకటేశ్వరరావువారి సహాయకులు దాడి చేయబోగా ముఠా పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించగా పై విషయాలన్నీ నిందితులు ఒప్పుకున్నట్లుగా సీ ఐ తెలిపారు. ఈ మేరకు ఐదుగురు ‘వేట’ ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.