ఆంధ్రప్రదేశ్‌

కడవరకూ టీడీపీలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: రాజకీయాల్లో ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తి లేదని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం విలేఖరులతో మంత్రి గంటా మాట్లాడుతూ అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే కానీ టీడీపీని వీడబోనని ఉద్ఘాటించారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు తాను పోటీలో ఉంటానన్నారు. తనకు టీడీపీలో మంచి స్థానమే ఉందన్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరుతూ మంత్రి గంటాపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. పార్టీ మారుతున్న సందర్భంలో టీటీపీపై విమర్శలు చేయడం సరికాదని, తనపై విమర్శలు చేసిన అవంతిపై తిరిగి ప్రతి విమర్శలు చేసి తన స్థాయిని దిగజార్చుకోలేనన్నారు. ఏలూరులో వైసీపీ అధినేత జగన్ బీసీ గర్జన సదస్సుపై గంటా స్పందించారు. జగన్‌కు బీసీ గర్జన నిర్వహించేందుకు అర్హత లేదన్నారు. వైసీపీలో బీసీల స్థానం నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడైనా వైసీపీ బీసీ జిల్లా అధ్యక్షులు ఉన్నారా? అని ప్రశ్నించారు. అటువంటి పార్టీ బీసీలకు న్యాయం చేస్తామంటూ గర్జన సదస్సులు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు.