ఆంధ్రప్రదేశ్‌

నారా లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 17 : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే ఎస్వీ ఆదివారం కర్నూలు నగరంలోని తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్న 11 మంది ఎమ్మెల్సీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారన్నారు. వారిలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, యనమల రామకృష్ణుడుతో పాటు నారా లోకేష్ కూడా మంచి నియోజకవర్గం కోసం పరిశీలన చేస్తున్నారని ప్రకటించారన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఒక బహిరంగ సభలో కర్నూలు అసెంబ్లీ సీటు ఎస్వీ మోహన్‌రెడ్డికే అని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా లోకేష్ ప్రకటించారన్నారు. తనపై ఉన్న అభిమానంతో లోకేష్ అలా ప్రకటించారని, ఆయన తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అలాగే ఐటీ హబ్, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మంత్రి నారా లోకేష్‌ను కర్నూలు నుంచి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాని తెలిపారు. తనకు పత్తికొండ, ఆలూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె వంటి నియోజకవర్గాల్లో బంధు వర్గంతో పాటు అనుచరగణం ఉందని జిల్లాలో పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని, కేవలం నారా లోకేష్ మీద ఉన్న కృతజ్ఞతా భావంతో పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నానని వెల్లడించారు. ఎమ్మెల్యే ఎస్వీతో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు షరీఫ్, శ్రీ్ధర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి