రాష్ట్రీయం

జాతీయ స్థాయి వరకే ఫ్రంట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 20: జాతీయ స్థాయిలో బీజేపీయేతర ఐక్య ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తామని, రాష్ట్రాల్లో బలాలవారీగా పోటీకి దిగుతామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అధికారం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. రిమోట్ కంట్రోల్‌తో రాష్ట్రాలను శాసించాలని కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తప్పుడు సర్వేలు చేయిస్తోందని, రాజకీయ లబ్ధికోసమే సర్వేలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు సర్వేలు చేస్తే వైసీపీ అడ్డుకుంటోందని, తప్పుడు సర్వేల గుట్టు రట్టవుతుందనే భయం జగన్‌కు ఉందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవిక సర్వేలంటే వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌తో కలిసి బెదిరింపులకు దిగడం వల్లే టీడీపీకి కొందరు దూరమవుతున్నారని, బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు చూపించి బెదరిస్తున్నారని, తెలంగాణలో వ్యాపారాలకు అడ్డం ఉండదనే భరోసా ఇస్తూ టీఆర్‌ఎస్ నేతలే వైసీపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు వైసీపీలో చేరుతున్నారని దుయ్యబట్టారు. డబ్బు సంచుల కోసమే మోదీ, కెసీఆర్‌తో జగన్ లాలూచీ పడుతున్నారని, బీజేపీ, టీఆర్‌ఎస్‌తో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆ మూడు పార్టీల కుట్రలు సాగవన్నారు. స్వార్థంతో దేశభద్రతను పణంగా పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయ లాభాల కోసం సైన్యంతో చెలగాటమాడటం దారుణమన్నారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన కేంద్రం చేతులెత్తేసిందని విమర్శించారు. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయని, మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కేంద్ర అసమర్థతతో దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బీజేపీ నేతలు తప్పుడు విధానాలతో దేశాన్ని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ పూర్తిగా ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని, అందుకే చిన్నాచితక పార్టీలతో పొత్తులకై ఆరాటపడుతోందన్నారు. అధికారం కోసం బీజేపీ దేనికైనా దిగజారుతుందని, ఎన్నికల్లో కార్యకర్తలు ఆ పార్టీ కుట్రలను భగ్నం చేయాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు 10 వేలు పెంచటంతో ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. దీన్ని పార్టీకి సానుకూలంగా మలుచుకోవాలని నిర్దేశించారు. ప్రభుత్వ లబ్ధిపొందిన వారంతా టీడీపీ వెంటే ఉన్నారన్నారు. రైతులు, మహిళలు, యువత తెలుగుదేశం వెంటే ఉన్నారని, వేల కోట్ల ఆర్థికలోటు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో రాజీపడలేదని చెప్పారు. నేరస్థులతో సినీనటులు భేటీ కావడం దురదృష్టకరమని పరోక్షంగా సినీ హీరో నాగార్జున, జగన్ భేటీపై వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు అందుతాయన్నారు. అభివృద్ధికి అందరూ అండగా ఉండాలని కోరారు. పేదల సంక్షేమానికి కలిసి రావాలని, వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
సమర్థులకే అవకాశం
జిల్లాలవారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి ప్రజావేదికలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వివరిస్తూ, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం కడప పార్లమెంటు, రాజంపేట స్థానాలపై సమీక్ష జరిపారు. అంతకుముందు కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే ప్రామాణికమని తేల్చిచెప్పారు. బూత్ నుంచి రాష్టస్థ్రాయి వరకు పకడ్బందీగా పార్టీ నిర్మాణం జరగాలని, అన్ని స్థాయిల్లో నేతలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కొందరికే అవకాశం ఇస్తామని స్పష్టంచేశారు. మిగిలిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సానుకూల దృక్పథమే టీడీపీ మూలసూత్రమని, ప్రతికూలతకు స్థానం లేదన్నారు. కృష్ణాజిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 16 అసెంబ్లీ స్థానాలు, కడప జిల్లాలో రెండు ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు.