రాష్ట్రీయం

ఢిల్లీలో తెలంగాణ ఫుడ్ స్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశ రాజధానిలో తెలంగాణ భవన్‌లో ఫుడ్స్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంప్రదాయ రుచులతో కూడిన వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్‌ను శుక్రవారం నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ జీ అశోక్‌కుమార్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, స్వయం శక్తిఅగ్రి వ్యవస్థాపకుడు వీర్‌శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ రుచులు, చిరుధాన్యాలతొ కూడిన వంటకాలను ఢిల్లీలో నివసిస్తున్న తెలుగువారికే కాకుండా ఉత్తరాది ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మారుతున్న కాలంలో ఆహారపుటలవాట్లలోనూ చాలా మార్పులు వచ్చాయని, మళ్లీ సాంప్రదాయ వంటకాల వైపుప్రజలు మొగ్గుచుపుతున్నారని అశోక్‌కుమార్ అన్నారు.