క్రైమ్/లీగల్

భార్యపై కత్తితో దాడి: భర్త అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 3: మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తను బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరి పివీఎన్‌కాలనీలో నివసించే ఎం.పోలిరెడ్డి(35), పద్మ(30) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగం చేసే అతడు గత కొంత కాలంగా తాగుడుకి బానిసై నిత్యం భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈనెల 2వ తేదిన రాత్రి మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవకు దిగిన అతడు తాగిన మత్తులో కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.