వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తరువాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డిగారిని బలంగా కదిలించలేకపోయింది. కన్యాశుల్కం గొప్పదనాన్ని గుర్తించటమూ, తృణకంకణం రాసిన రాయప్రోలును అభినందించటమైతే చేశారు కానీ ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా ఇలా అన్నారు.
‘‘కట్టమంచివారు ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడతిట్టిపోసినా తెలుగు కవిత్వానికి ఒక దారీ తెన్నూ చూపించలేకపోయారు. తెలుగు కవిత్వానికి ఆయన చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ప్రబంధ కవిత్వం 19వ శతాబ్దంలోనే చచ్చింది. ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రం రామలింగారెడ్డిగారికి దక్కింది. ఆ తరువాత వచ్చిన భావకవిత్వం దశ ఆయన ఊహకే తట్టలేదు. నిజానికి ఆయనది చారిత్రాత్మకంగా ముందుచూపు కాదు’’.
రా.రా అభిప్రాయంలో సత్యం లేదనలేము కాని అది పూర్తి సత్యం మాత్రం కాదు. అంతేకాదు రామలింగారెడ్డిగారు మొదటినుంచీ చివరివరకూ పరమ చాదస్తమైన గ్రాంథిక భాషనే రాశారు. 1951 వరకూ జీవించినా అభ్యుదయ కవిత్వ శిఖరాలను కూడా వారు తలెత్తి చూడలేదు. కానీ వారు ప్రబంధ కవిత్వంలోని గతానుగతికత్వం నుంచీ, అలంకార శాస్త్రాల సంకెళ్లనుంచీ, తుచ్ఛ శృంగారంనుంచీ సాహిత్య జిజ్ఞాసువుల దృష్టిని భావనాశక్తివైపునకూ, వాస్తవిక జీవితంవైపునకూ మళ్లించగలిగారు. అలా వారు పరోక్షంగా కొత్త కవిత్వానికి దారి చూపారు. ఆ తరువాత వారు ఘనీభవించి పోవటానికి రెండు కారణాలుండవచ్చు.
మొదటిది: సాహిత్యం రామలింగారెడ్డిగారికి ప్రధాన కార్యరంగంకాదు. కవిత్వతత్త్వ విచారం ప్రచురించిన కొద్దికాలానికే వారు రాజకీయాల్లో, విశ్వవిద్యాలయ పరిపాలనలో తలమునకలుగా కూరుకుపోయారు. ఇంగ్లీషులో రొమాంటిక్ కవితతో విమర్శతో బాగా పరిచయం వున్న రామలింగారెడ్డిగారికి తెలుగులో భావకవులపట్ల వైముఖ్యం ఉండటానికి అవకాశం లేదు.
రెండవది: సాధారణంగా మానవుడు తాను ఎంతవరకు మారాడో అంతవరకూ మాత్రమే మార్పును ఆమోదిస్తారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం