ఆంధ్రప్రదేశ్‌

కరవు సంసిద్ధత పథకానికి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 18: రాయలసీమ ప్రాంతంలో గుర్తించిన కరవు జిల్లాల్లో కరవు సంసిద్ధత పథకం (పల్లె జీవం - ఏపీ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ - ఏపీడీఎంపీ) ద్వారా అమలుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. అత్యంత కరవు జిల్లాలైన అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో లక్షా 65వేల కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టామన్నారు. సోమవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ఏపీ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ కరవు ప్రాంతాల్లో కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్నివిధాలా అభివృద్ధిలోకి తేవటంతో పాటు వారి జీవన ప్రమాణాలను పూర్తిగా మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కరవు ప్రాంతాల్లో పంటలు కాపాడేందుకు అవసరమైన నీటి పారుదల పద్ధతులు, మెరుగైన భూసార పరిరక్షణ, కరవును తట్టుకునే పంటల రకాలు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు తదితర అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. వర్షపునీటి నిల్వ ద్వారా మరింత నీటిని అందుబాటులోకి తీసుకుని భూగర్భజలాలు రీచార్జి చేయటం, వాతావరణం, మార్కెట్, పంటల ఎంపిక గురించి సమాచారం అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ పథకం కింద నాలుగు రాయలసీమ జిల్లాలు మినహా ప్రకాశం జిల్లాలోని వర్షాధార వ్యవసాయం, భూగర్భ నీటిపారుదలపై ఆధారపడిన రెండు హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న, సన్న కారు రైతులు, ఎస్సీ, ఎస్టీ కులాలు, మహిళ ఆధారిత లక్షా 65వేల కుటుంబాలను గుర్తించి కరవు పరిస్థితుల నుండి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు 5 జిల్లాల్లోని 105 మండలాలను వర్షాధార వ్యవసాయం, ఎక్కువ సార్లు కరవుకు గురికావడం, భూగర్భజలాల కొరత, పేద గ్రామ, మండలాలుగా జిల్లా యంత్రాంగం గుర్తించిందని తెలిపారు. తిరిగి ఆయా మండలాల్లోని 315 గ్రామాలు 75 శాతం కంటే తక్కువ ఆధారిత వ్యవసాయక ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న పట్టణాలకు దూరంగా ఉన్న గ్రామాలు, గొర్రెలు, మేకల సంతతి అధికంగా ఉన్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ గ్రామాల్లో వ్యవసాయ, పశుపోషణ రంగాల్లో నూతన సాంకేతిక విధానాల అమలు, భూగర్భజలాల సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటారు. రైతు ఉత్పత్తిదార్ల సంఘాలను ఏర్పాటుచేసి వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు వాతావరణ, పంటల యాజమాన్యం, పరికరాలను అందించడం, నీటి యాజమాన్యం, పశుపోషణ, మార్కెటింగ్, అంశాలపై సూచనలు, సమాచారం సమకూర్చి కరవును తట్టుకుని అధిక ఆదాయం పొందే విధంగా సమాయత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా ఈ ఐదు జిల్లాల్లో 105 రైతు ఉత్పత్తిదార్ల సంఘాలకు రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 52వేల 622 హెక్టార్ల మెట్ట వ్యవసాయానికి రక్షిత తడి ఇచ్చి పంటలను కాపాడతారు. మరో 3300 హెక్టార్లలో బోర్ల నీటి వినియోగం, లక్షా 65వేల హెక్టార్లలో పంట మార్పిడిని పాటించటం, 9.9 మిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని సమీకరించడం (నీటికుంటల ద్వారా), 42,900 హెక్టార్ల బంజరు భూములను పశుగ్రాస క్షేత్రాలుగా మార్చటం వంటి చర్యల ద్వారా రైతులకు మేలు జరిగేలా పథకాన్ని అమలులోకి తెస్తారు. ఐదేళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం రూ 1042 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికి అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి సంస్థ (ఐఎఫ్‌ఎడి) రూ 528 కోట్లు, నాబార్డ్ 43.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 96.9 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద 294.16 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజన ద్వారా 17.13 కోట్లు, లబ్ధిదారుల వాటాగా 61.47 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ అమలులో ఇక్రిసాట్, అంగ్రూ, ఎన్‌బీఎస్‌ఎస్, రిలయన్స్ ఫౌండేషన్, బర్డ్, కెవికె, ఎఫ్‌ఈఎస్, ఆర్‌వైఎస్‌ఎస్ వంటి వివిధ సాంకేతిక సంస్థలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అంతకు ముందు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పథకం అమలు తీరును వివరించారు. అనంతరం 2019-20 వార్షిక వర్క్‌ప్లాన్ అండ్ బడ్జెట్ కింద పథకం అమలుకు రూ 287.73 కోట్ల నిధుల మంజూరుకు స్టీరింగ్ కమిటీ ఆమోదించింది. అనంతరం ఏపీడీఎంపీ రూపొందించిన పల్లెజీవం సంకల్పం మాసపత్రికను సీఎస్ పునేఠా ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖల కార్యదర్శి శ్రీ్ధర్, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి, ఏపీడీఎంపీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వీడీవీ కృపాదాస్, గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, వాసన్ సంస్థ డైరెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. పల్లెజీవం సంకల్పం మాసపత్రికను ఆవిష్కరిస్తున్న సీఎస్ పునేఠా, అధికారులు