రాష్ట్రీయం

జగన్‌కు ఓటేస్తే రౌడీ రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి, మార్చి 20: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా గెలిపించి, రాష్ట్రాన్ని తమ అదుపులో ఉంచుకోవాలని చూస్తున్న తెలంగాణ పార్టీ టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బుధవారం నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవలి ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో గణనీయమైన మెజార్టీ సాధించినా కేసీఆర్ మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను సైతం ఆకర్షించడం ద్వారా బలవంతునిగా ఆవిర్భవించాలని చూస్తున్నారన్నారు. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి 17 సీట్లు గెల్చుకుంటామని, ఇక్కడ వైసీపీని గెలిస్తే మనపై పెత్తనం చేయవచ్చని కేసీఆర్, మోదీ చూస్తున్నారన్నారు. ఏకపక్షంగా టీడీపీని గెలిపిస్తే, రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. అలాగే కోడికత్తి డ్రామా వంటి కుతంత్రాలకు తావుండదన్నారు. పొరపాటున వైసీపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని హెచ్చరించారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసునే ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి ప్రజల పాలిట ఎలా వ్యవహరిస్తారో ఆలోచించాలన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన మోదీ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ మోసం చేశారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో, నెత్తిన అప్పులతో ఇక్కడకు వచ్చి బస్సులోనే పడుకుని బస్సులోనుండే పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తిని తానేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిచేసి, ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. తాను ఇంత కష్టపడుతుంటే విపక్షనేత జగన్మోహనరెడ్డి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉంటూ ఒక్క్ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబునాయుడు విమర్శించారు. జగన్‌కు సరియైన పరిజ్ఞ్ఞానం లేదని, కనీసం తాను ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేడని అలాంటి వ్యక్తి ప్రజలకు రాష్ట్రానికి ఏంచేయగలడని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాడని, ప్రజాసమస్యలు అక్కర్లేదని, జీతాలు మాత్రం తీసుకుంటాడని. వైసీపీ ఎంపీలు పార్లమెంటుకు వెళ్లరని, వారికి మోదీ అంటే భయమని అన్నారు. రాష్ట్రం కోసం తెలుగుదేశం ఎంపీలు అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని, ఆంధ్రాకు ద్రోహం చేసిన మోదీకి ఎట్టి పరిస్థితులలోను అధికారం కట్టబెట్టకూడదన్నారు ముఖ్యంగా మైనార్టీలు బాగా ఆలోచించి ఓటు వెయ్యాలని మోదీతో వారికి భద్రత ఉండదని గమనించాలన్నారు. ‘ఆంధ్రా పోలీస్ వద్దు తెలంగాణ పోలీస్ ముద్దు’ అని అంటున్న జగన్ వెళ్లి తెలంగాణలోనే ఉండాలని సూచించారు. జగన్‌లాంటి వ్యక్తులు తెలంగాణా వెళ్లిపోతే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా బతుకుతారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనపై కక్ష కట్టాడని, మన ఆస్తులను దోచుకోవడమేగాక మనకు ఇవ్వవలసిన బాకీలు కూడా ఇవ్వడం లేదని, జగన్‌ను గెలిపించడానికి అనేకమందిని బెదిరిస్తున్నాడని అన్నారు. మోదీ, కేసీఆర్ చేతిలో రిమోట్ జగన్ అని అన్నారు. జగన్‌కు ఒక్క్ఛాన్స్ ఇస్తే మరణశాసనాన్ని రాసుకున్నట్లేనని జాగ్రత్తగా ఆలోచించి తెలుగుదేశం పార్టీకే ఓటు వెయ్యాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. తాను రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నానని 24,500 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తనదేనని, ఆఖరి వాయిదా కూడా ఎన్నికల తేదీలోపు రైతుల ఖాతాలకు చేరుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తాను బతికున్నంతవరకు ఆడపడుచులకు పసుపు కుంకుమ కింద నగదు అందజేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా వచ్చే ఖరీఫ్ నుండి పెట్టుబడి సాయం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకకటించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని రాష్ట్ర గౌరవాన్ని కాపాడతానని కుటుంబ పెద్దగా మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ పూనారు. ఏలూరు లోక్‌సభ టిడీపీ అభ్యర్థి మాగంటి బాబు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులు కర్రా రాజారావు, బి.శ్రీనివాసరావు, దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, టిడిపీ జిల్లా అధ్యక్షురాలు సీతమహాలక్ష్మి, చింతలపూడి మాజీశాసనసభ్యుడు ఘంటా మురళీ రామకృష్ణ, స్థానిక మాజీ ఎయంసి చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
చిత్రం.. బుధవారం చింతలపూడి సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు