ఆంధ్రప్రదేశ్‌

భక్తజనంతో పోటెత్తిన తుంబుర తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 20: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ పుణ్య తీర్థమైన తుంబుర తీర్థ ముక్కోటి సందర్భంగా బుధవారం దాదాపు 18వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు కాలినడకన తుంబుర తీర్థానికి చేరుకున్నారు. ఈసందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా టీటీడీ ఉదయం, సాయంత్రం ఉప్మా, కాఫీ, పాలు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నం, పెరుగన్నం, టమోట అన్నం, బిస్మిల్లాబాత్, పులిహోరను అందించింది. అలాగే 25వేల తాగునీటి బాటిళ్లు, 65వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసింది. భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 632 మంది శ్రీవారి సేవకులు, 90 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బంది, రెండు అంబులెన్స్‌లను, పారామెడికల్ సిబ్బంది, టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది భక్తులకు సేవలందించారు.