ఆంధ్రప్రదేశ్‌

పీవీపీ కుటుంబ సభ్యుల ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: వైకాపా తరపున విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రసాద్ వీర పొట్లూరి (పీవీపీ) తన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ. 236.29 కోట్లుగా ప్రకటించారు. ఆయన శుక్రవారం తన నామినేషన్ పత్రంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలను ప్రకటించారు. పీవీపీకి రూ. 39.36 కోట్లు, ఆయన భార్య ఝాన్సీకి 196.6 కోట్లు, కుమార్తె పెర్ల్ పేరున 5.27 లక్షల రూపాయలు, కుమారుడు పరం వెంకట్ పేరున 27.68 లక్షల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తన పేర 2.91 కోట్ల రూపాయల మేర అప్పులు, భార్య పేరున 18.03 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తెలిపారు. 7.36 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ వివాదాల్లో ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం 53.41 లక్షల రూపాయలని, తన భార్య ఆదాయం 95.73 లక్షల రూపాయలని తెలిపారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన ఒక క్రిమినల్ కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ప్రసాద్ పేరున 15.95 లక్షల మేర వివిధ సేవింగ్స్ డిపాజిట్లు ఉండగా, ఆయన భార్య పేరున 1.13 కోట్ల రూపాయల మేర సేవింగ్స్ డిపాజిట్లు ఉన్నాయి. వివిధ కంపెనీల్లో 103.61 కోట్లు, 49.87 లక్షల రూపాయల విలువ చేసే షేర్లు వారిద్దరీ పేరున ఉన్నాయి. 600 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, 45.95 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. భార్య పేరున 65.51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు.