మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యమేదియో అనిత్య మేదియో వివేచన చేయుము.
503. పసిబాలుని నమ్మికను బోలు నమ్మిక లేనియెడల ఈశ్వర సాక్షాత్కారము పొందుట యసాధ్యము. ఎవనినైనను జూపి, ‘‘ఆతడు నీయన్న’’ యని తల్లి చెప్పిన యెడల బిడ్డడు ఆవనిని నిజముగా తన యన్నయని భావించును.
‘‘అటుపోకము. అక్కడ బూచి యున్నది’’ అని తల్లి చెప్పిన పక్షమున అక్కడ ఏదియో బూచి యున్నదనియే బిడ్డడు నమ్మును. ఇట్టి పసివాని విశ్వాసమువంటి విశ్వాసముగల నరునిపైని భగవంతునకు కరుణ గల్గును. ఊరక లాభనష్టములనుగుఱించి అంచనాలు వేయుచుండు లౌకిక బుద్ధులు భగవంతుని బొందుట దుర్లభము.
504. ఒకనాడు శ్రీకృష్ణుడు అర్జునునితో రథమెక్కి వెడలుచు, ఆకసమువంక జూచి, ‘‘అర్జునా! పావురములు ఎంత చక్కగా బారులుతీరి యెగురుచున్నవో చూడు?’’మనియెను. అర్జునుడు వెంటనే ఆయన వైపు దృష్టినిగిడ్చి, ‘‘బావా! నిజమే. చాల చక్కని పావురములు సుమీ!’’ అనియెను. మఱుక్షణముననే శ్రీకృష్ణుడు మఱల చూచి యిట్లు పలికెను: ‘‘కాదోయి! అని పావురములవలె గాన్పించుట లేదు.’’ అర్జునుడు మఱల చూచి, ‘‘నిజమే! అవి పావురములు కావే!’’ అనియెను. ఇందలి భావమేమో గ్రహింపుడు. సత్యసంధుడగు నర్జునుడు కేవలము శ్రీకృష్ణుని పొగడుటకై ఆతడు చెప్పినదానికెల్ల తలయూపెనని తలపజాలము. కాని యాతడు శ్రీకృష్ణుడేమి చెప్పినను వెంటనే ప్రత్యక్షముగా గాంచునంతటి దృఢ విశ్వాసము గలవాడు.
505. పంచదార పానకమును కసకసలాడు నిప్పుపై బెట్టి పాకము పట్టుము. దానిలో మాలిన్యమున్నంతవఱకు ఆ పాకమునుండి పొగయు కళపెళమను శబ్దమును వచ్చుచుండును. కాని మాలిన్యమును లేక తెట్టెను తొలగించిన పిమ్మట పొగయు శబ్దమును అణగును; స్వచ్ఛమైన పాకము పొంగులు దేఱుచుండును, అప్పుడది గడ్డకట్టినను పలుచగా నున్నను దివ్యముగా నుండును; దేవతలకుగాని, మానవులకు గాని పరమానందప్రదమై యొప్పును. శ్రద్ధ్భాక్తులు గలవాని నడవడి యిట్టిది.
506. ఒకడు నదిని దాటవలసి వచ్చెను. ఒక సిద్ధుడు వానికొక తాయెతునిచ్చి, ‘‘ఇది నిన్ను నదిని దాటించును’’ అని చెప్పెను. ఆతడు దానిని గైకొని నదిమీదుగా నడచిపోవుచుండెను. కాని సగముదూరము పోవుసరికి, తనకంత యద్భుతశక్తి నొసగిన యా తాయెతులో నేమున్నదో చూడవలయునని వానికి కుతూహలము కలిగెను. అంత దానిని విప్పి చూడ నొకకాగితముపై పావనమగు రామనామము లిఖింపబడియుండెను. అది గని, ‘‘ఇదియేనా ఇందలి రహస్యము’’అని తృణీకారభావము పొందెను. ఈ యవిశ్వాసము కలిగినంతనే ఆతడు నదిలో బుడుంగున మునిగిపోయినాడు. భగవన్నామమందలి శ్రద్ధ్భాక్తులు అద్భుత కార్యములను జేయగలవు. శ్రద్ధయే జీవనము, అశ్రద్ధయే మరణము.
507. ఒక శిష్యుడు తన గురుననంతశక్తియుం దఖండ విశ్వాసముగలవాడై, గురునామస్మరణ మాత్రమున నీటిపై నడచిపోవుచుండెను. దానిని గాంచి యా గురువు ఇట్లు తలచెను: ‘‘ఆహా! కేవలము నా నామమునందే ఇంతటి మహిమయున్న యెడల నేనెంతటి మహాత్ముడనో, శక్తిమంతుడనో!’’ - మరునాడాగురువు, ‘నేను’, నేను’, ‘నేను’ అనుచు ఆ నదిపై నడచిపోవ యత్నించెను. కాని అతడు నదిలో అడుగుపెట్టెనో లేదో అందు మునిగిపోయెను. ఈదుదామనుకొన్నను పాపమాతనికి ఈత కూడా తెలియదయ్యెను. విశ్వాసము అద్భుత కార్యములను సాధించును; అహంభావమో, వినాశనము దెచ్చిపెట్టును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి