Others

మంచిని పెంచాలి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంచిని పెంచాలి’ చిత్రాన్ని జగజ్జనని ప్రొడక్షన్స్ నిర్మించి మార్చి 1980లో విడుదల చేశారు. ఇది ప్రభోదాత్మక సాంఘిక చిత్రం. చిత్రకథ బిగువైన సన్నివేశాలతో ఉంటుంది. నిజానికి 1976లో మొదలైన చిత్రం నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల నాలుగేళ్ల జాప్యంతో చిత్రాన్ని విడుదల చేయడం, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కథ, సంభాషణల రచనతోపాటు ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాతలు కొత్తవారు కావటం, దర్శకుడి సహకారం లేక, వ్యాపారంలో పంపిణీదారులు, థియేటర్లు దొరక్క వారికి తొలి ప్రయత్నమే విఫలమైంది. ఈ చిత్రంలో ఆనాటి యువ కొత్త హీరోలు శ్రీ్ధర్, ఈశ్వరరావు, హరిబాబు కాగా హీరోయిన్లుగా ఫటాఫట్ జయలక్ష్మి, హేమాచౌదరిలతోపాటు సీనియర్ హీరో కాంతారావు, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎఎమ్ రాజా సంగీత సారథ్యంలో మంచి పాటలు ఇచ్చారు కూడా. ‘మంచిని పెంచాలి’ టైటిల్ సాంగ్ అప్పట్లో పాపులరైంది. మిగతా పాటలు కూడా బాగానే ఆదరణకు నోచుకున్నాయి. కాని చిత్రం, పాటలు కనీసం యూట్యూబ్‌లో కూడా అందుబాటులో లేవు. అభ్యుదయ భావాలుగల కాంతారావు, సావిత్రి దంపతులు ముగ్గురు అనాథ పిల్లలను కన్నబిడ్డల మాదిరిగా పెంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారిలో ఇద్దరు పోలీస్ ఇన్స్‌పెక్టర్, న్యాయవాది అన్యాయాన్ని ప్రతిఘటించే ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీరు మంచిని పెంచటానికి కృషి చేస్తున్న ప్రయత్నంలో నిరుద్యోగైన మూడోవాడు సమాజంలోని ప్రతిఘటనల్ని ఎదుర్కొంటూ పరిష్కరించుకొనే ప్రయత్నమే ఈ చిత్ర కథనం. శ్రీ్ధర్, ఈశ్వరరావు, హరిబాబులు సమర్థమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్‌లో పరిమితి బడ్జెట్‌తో పూర్తిగా ఔట్‌డోర్‌లో ఒంగోలు, అద్దంకి, శింగరాయకొండ, మణికేశ్వరం, మేదరమెట్ల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. మంచినిపెంచాలి చిత్రాన్ని నలభై ఏళ్లు కావస్తున్నా మరలా చూసే అవకాశంరాక జ్ఞాపకాల మరుగైంది. ఈ ప్రింట్ ఎవరిదగ్గరైనా ఉంటే అంతర్జాలంలో పెడితే బావుంటుంది. ఏదైనా టీవీ చానల్ ఈ సినిమాను వెతికిపట్టుకుని ప్రసారం చేసినా బావుంటుంది. ఇప్పటి యువతరానికి ఒకింత ఆదర్శాన్ని నేర్పిపెట్టగల చిత్రమిది.

-పియల్ సుజాత, అద్దంకి