పాటేసుకున్న పాయల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో సెనే్సషన్ క్రియేట్ చేసిన సొగసరి పాయల్ రాజ్‌పుత్.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. సినిమా కథానుసారం కీలక సమయంలో బుల్‌రెడ్డి.. అంటూ సాగే ఈ స్పెషల్ పెప్సీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సాంగ్‌లో పాయల్ సోలో ఫెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా నిలవనుంది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈ టీజర్‌తో సహా సినిమాపై వున్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.