అటు తమన్నా.. ఇటు శృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిరంజీవి హీరోగా 150వ సినిమా ఖైదీ నెం 150తో రీ ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని అందుకుని స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా 100 కోట్ల మార్కెట్‌ని కొల్లగొట్టాడు. తరువాత భారీ బడ్జెట్‌తో సైరా చిత్రంలో నటిస్తున్నాడు చిరు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తారట. ఇక మెగాస్టార్ 152వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనుండటం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు శివ రెడీగా ఉన్నాడు. చిరంజీవి ఫ్రీ అయితే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేందుకు హీరోయిన్స్‌ని కూడా ఫైనల్ చేశాడని సమాచారం. హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు టాక్. ఇక మరో కీ రోల్లో గ్లామర్ భామ శృతిహాసన్ నటిస్తుందట. ఈ చిత్రాన్ని కూడా రామ్‌చరణ్ నిర్మిస్తాడట. ఈ సినిమా తరువాత ఆయన 153వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఉంటుందట!