రాష్ట్రీయం

పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎలాంటి అంచాఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. దీంతో ఎక్కడా గొడవలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. గత అనుభవాలను దృష్టిలోపెట్టుకుని ముందస్తుగా భద్రతకు సంబంధించి గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్తర తెలంగాణ దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సాయుధ బలగాలను మోహరించామన్నారు. ఉత్తర తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మావోయిస్టును కట్టడి చేశామన్నారు. ఈ నియోజక వర్గాల్లో ఎన్నికల కమిషన్ త్వరగా పోలింగ్‌ను పూర్తి చేసింది. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, మంథని, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏజన్సీ గ్రామాల్లో భద్రత విస్తతం చేశామన్నారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోకి కేంద్ర బలగాలను తరలించినట్టు డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టుల కదలికలున్న 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగించారన్నారు. ఈవీఎంలను పటిష్ట భద్రతల మధ్య జిల్లా కేంద్రాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల వ్యవస్థతో భద్రతాఏర్పాట్లు చేశామన్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఓటర్లు సంయమనం పాటించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. పాత బస్తీలోకొంత ఉద్రిక్త నెలకొన్నప్పటికీ బలగాలు మోహరించడంతో గొడవలు జరగలేదన్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ ముందస్తుగా అల్లర్లు జరిగే ప్రాంతల్లో భద్రతను పట్టిష్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు అదనపు పోలీస్ బలగాలను తరలించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

చిత్రం... టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు