ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల కమిషన్ సిగ్గుతో తలదించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఏప్రిల్ 12: రాష్టల్రో పోలింగ్ సందర్భంగా 40 నుండి 50 శాతం ఈవీఎంలు మొరాయించటం ఎన్నికల కమిషన్ వైఫల్యమేనని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విలేఖర్ల సమావేశంలో కోడెల మాట్లాడుతూ మహిళలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. రాష్ట్రానికి కావాల్సిన మేర బలగాలు రాలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా పోలీసులు కనపడలేదన్నారు. పోలీసులు లేని కేంద్రాల వద్ద వైసీపీ అరాచకాలకు పాల్పడిందన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనిమెట్లలో జరిగిన సంఘటన బాధాకరమని, ఇటువంటి ఘటన తన చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. అవసరమైన మేర బలగాలను పంపించకపోవటం వల్లనే ఇటువంటి పరిస్థితి నెలకొందన్నారు. ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌ల్లో దౌర్జన్యం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లగా, పోలింగ్ అధికారుల ముందే 45 నిమిషాలపాటు తనపై దౌర్జన్యం జరిగిందన్నారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో బాసు లింగారెడ్డి, రాజనారాయణ దౌర్జన్యకారులను ప్రోత్సహించారని అన్నారు. ఊరిలో వారితోపాటు బయటనుండి వచ్చిన రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, సుమారు 2 గంటలపాటు దాడి జరుగుతున్నా పోలీసులు దగ్గరకు కూడా రాలేదన్నారు. పోలింగ్ కేంద్రానికే భద్రత లేకపోతే ఎన్నికలు సజావుగా ఎలా నిర్వహించగలరన్నారు. ఇప్పటివరకు పోలింగ్ రిపోర్టు ఇవ్వలేదని, పోలింగ్ ప్రక్రియ అపహాస్యం అవుతుంటే రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు చేతులు ముడుచుకొని కూర్చున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తక్కువ భద్రతా బలగాలను పంపించి, ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టిందన్నారు. ఇన్ని గొడవలు జరుగుతున్నా మహిళలు అధికసంఖ్యలో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. జగన్ ఆలోచన్లు మంచివి కావన్నారు. వైసీపీ రౌడీలు తనపై రాళ్ళు, కారం, ఇసుకతో దాడికి పాల్పడ్డారని, స్పీకర్‌కే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్తల, ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రీ పోలింగ్ జరగకపోతే ఇనిమెట్ల బూత్‌లోని రిటర్నింగ్ అధికారితోపాటు అందరి పాత్ర ఉన్నట్లేనని స్పష్టం చేశారు. దాడుల ద్వారా వైసీపీ అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తోందన్నారు. జగన్ ద్వారా ఏపీలో పెత్తనం చేయటానికి టీఆర్‌ఎస్ చూస్తోందన్నారు. తెలంగాణ నుండి ఆంధ్రా ఓటర్లు వచ్చే బస్సులను సైతం కేసీఆర్ నిలిపివేశారని, అయినా ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.