AADIVAVRAM - Others
అమ్మ దీవెన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 April 2019
-షణ్ముఖశ్రీ.. 8897853339
అమ్మ దీవెన అందరికీ తెలుసు
ఆమె ప్రసవ వేదన ఎందరికి తెలుసు?
అందుకే అందరూ మాతృభూమికీ
మాతృదేశానికీ రక్షక భటులు కావాలి
కాళీమాత ఆశీస్సులే
శారదా రామకృష్ణుల శాశ్వతానందం
భువనేశ్వరీ దేవి తపోఫలమే
వివేకానందుని జన్మసాఫల్యం
జిల్లెళ్లమూడి అమ్మ ఆశయమే
ఆమె సన్నిదానంలో నిత్యాన్నదానం
ఛత్రపతి శివాజీ
రాణీ రుద్రమదేవి
కంచి పరమాచార్య
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి
మంత్రసిద్ధులూ, ప్రసిద్ధులూ
సిద్దేశ్వరానంద భారతీస్వామి
నేటి మేటి వాగ్ధాటి
చాగంటి వంటి జాతిరత్నాలు
మంచి ముత్యాలు, నిత్య స్మరణీయులు
కారణాలు వారి మాతృమూర్తుల
అమృత హస్తాల ఆశీర్వచనాలే
వాళ్లందరి ప్రవచనాలకు మూలాలు.