ఆంధ్రప్రదేశ్‌

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 22: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో చట్ట ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. బీసీ జనగణనపై అటు తెలంగాణ, ఇటు ఏపీ సర్కార్‌లు కోర్టుకు సరైన నివేదిక అందించలేదని దీంతో తెలంగాణలో 21 శాతం మాత్రమే అమలు చేశారన్నారు. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నందున తక్షణమే బీసీ గణన నివేదికను కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. అనాదిగా అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణ ఎన్నికల ముందే స్థానిక ఎన్నికలు జరక్కుండా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు వ్యూహం పన్నాయని విమర్శించారు. దీనివల్ల రెండు ప్రభుత్వాల బీసీ వ్యతిరేక కుట్ర అర్థమవుతోందని ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని సంఘం నేతలు తన్నీరు ఆంజనేయులు, కుమ్మర క్రాంతి కుమార్, పరసా రంగనాథ్, ధూళిపూడి ఏసుబాబు, అన్నం శివరాఘవయ్య, నాగలింగం, అంగిరేకుల గోపీ తదితరులు స్పష్టంచేశారు. ఈ విషయంలో వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
500 గిరిజన ఆవాసాలను పంచాయతీగా ప్రకటించాలి
రాష్ట్రంలో 500 గిరిజన ఆవాసాలు ఉన్న తండా, గ్రామం, గూడెంలను రెవెన్యూ పంచాయతీగా గుర్తించాలని గిరిజన ప్రజాసమాఖ్య డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంకు సమాఖ్య నేతలు వినతిపత్రం సమర్పించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి 500 ఆవాసాలు కలిగిన గిరిజన ప్రాంతాలను గ్రామాలుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిందని సమాఖ్య నేతలు వివరించారు. అయితే అది 2011 జనాభా లెక్కల ప్రకారం అనేక ఆంక్షలతో రూపొందించారని, జీవో మేరకు 9 జిల్లాల్లో 147 గిరిజన ప్రాంతాలనే గుర్తించారని తెలిపారు. ప్రభుత్వం జీవోను పునపరిశీలన జరిపి ఆంక్షలను తొలగించి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ప్రత్యేక రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడే విధంగా ఆవాసాలకు తగిన వౌలిక సదుపాయాలు కల్పించాలని సమాఖ్య జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.