ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ వివేకా హత్య కేసులో ఇంటి దొంగలను ఎందుకు అరెస్ట్ చేయలేదు: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 2: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 40 రోజులు గడుస్తున్నా ఎవరు హత్య చేశారో, ఎవరి ఆదేశాల మేరకు ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గురువారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకా కేసును ఎందుకు కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టారని ప్రశ్నించారు. హత్యకేసులో పాత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లో జరిగిన హత్యను ఇంటి దొంగలే చేశారని పరమేశ్వరరెడ్డి చెప్పారన్నారు. వివేకానందరెడ్డి చనిపోయారంటూ ఫ్రీజర్ ఇంటి ముందు పెట్టిన తర్వాత ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. కడప మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించలేదని, ఆయన కాల్‌డేటాను తీసుకుంటే విషయాలు బహిర్గతం అవుతాయని పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు హత్య ఎవరు చేశారో తెలుసని, వైకాపా అధినేత జగన్మోహనరెడ్డికి తెలిసే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. ఉత్సవ విగ్రహాలను అరెస్ట్ చేసి మూలవిరాట్టులను వదిలేస్తారా అని రామయ్య ప్రశ్నించారు. హత్యపై హైకోర్టు మాట్లాడవద్దన్నదనే సాకుతో కేసు దర్యాప్తును వదిలేస్తారా, ఎవరు చెబితే దర్యాప్తు ఆపేశారని వర్ల ప్రశ్నించారు.