రాష్ట్రీయం

అమ్మవారి కిరీటంలో కెంపు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మే 6: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అర్చకులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా అమ్మవారి మూల విరాట్‌పై నున్న కిరీటంలోని ఒక కెంపు (రత్నం) కనపడకుండా పోయంది. బంగారంతో చేసిన నవకెంపులు పొదిగిన కిరీటంతో దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన అమ్మవారు అధికారులు, పూజారుల నిర్లక్ష్యంతో బోసిపోయింది. అమ్మవారికి రోజువారీగా అలంకరించే కిరీటంలో ఒక రత్నం కొన్ని రోజుల నుండి కనపడకుండా పోయింది. అయినప్పటికీ ఇక్కడి పూజారులు అధికారులు కెంపు గురించి పట్టించుకోలేదు. ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత గల అమ్మవారి క్షేత్రం, కోట్లలో ఆదాయం ఉన్న అమ్మవారి మూలవిరాట్ కిరీటానికి కెంపు మాయమైన పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. అమ్మవార్ల అలంకారానికి సంబంధించిన బంగారు, వెండి, తదితర ఆభరణాలపై ఇంత నిర్లక్ష్యం వహించడం అర్చకుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొనవచ్చునని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏదో ఒక విషయంపై బాసర క్షేత్రం వివాదాలు చుట్టుముట్టడం సర్వసాధారణంగా మారింది. గతంలో అమ్మవారికి భక్తుడు ఇచ్చిన ఉత్సవ విగ్రహాన్ని తరలించి అక్షరాభ్యాస పూజలు చేయడం వివాదాస్పదమైంది. అందులో మార్పు రాకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి గత కొన్ని రోజులుగా ఆలయ అర్చకులు అదే కిరీటంతోనే అలంకరణ చేస్తున్నారు. ఈ విషయమై వివరణ కోరగా.. పూజారులు రోజువారీ అభిషేకం చేస్తున్న సమయంలో ఎక్కడో పడిపోయ ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఎక్కడైనా అసంపూర్తిగా ఉన్న నగలను మూలవిరాట్‌కు అలంకరించరు. కాని ఇక్కడ గత కొన్ని రోజుల నుండి కిరీటాన్ని అమ్మవారికి అలంకరిస్తున్నారు. అమ్మవారి ఆలయం ఏదో ఒక వివాదంతో ప్రతిసారి తెరమీదకు రావడం దేవాదాయశాఖ ఉన్నత అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు పూజారులలో మార్పు కనిపించడం లేదు. అధికారులకు, అర్చకులకు మెమోలు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు.
బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం......
బాసర అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు అలంకరించే కిరీటంపై కెంపు మాయమవడంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాద్యులన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.
స్థానాచార్యుడు, ప్రధాన అర్చకుడికి మెమో
బాసర అమ్మవారి ఆలయంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటానికి కెంపు మాయమవడంపై ఆలయ కార్య నిర్వహణ అధికారిణి సంధ్యారాణిని వివరణ కోరగా.. కిరీటంలోని కెంపు మాయమవడంపై ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకుడు సంజీవ్‌పూజారిలకు మెమో జారీ చేసినట్టు తెలిపారు.
చిత్రం... బాసర అమ్మవారి ఆలయం
*అమ్మవారి కిరీటం పైభాగంలో కెంపు (రత్నం) అదృశ్యమైన దృశ్యం (ఇన్‌సెట్‌లో)