రాష్ట్రీయం

బోర్డు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులకు చుక్కలు చూపించిన ఇంటర్ బోర్డు మరోమారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ రూపంలో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ప్రకటించబోతున్నారు. ఈ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు పెరిగింది ఏమీ లేదు, సరికదా కొంత మంది మార్కులు తగ్గినట్టు సమాచారం. పేపర్ల వాల్యూయేషన్ ప్రక్రియ ముగించిన అధ్యాపకులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే వంద మందిలో ఒకరిద్దరికి కూడా మార్కులు పెరగలేదని, అలాగే ఒకరిద్దరి మార్కులు తగ్గిన సందర్భాలున్నాయని పేర్కొంటున్నారు. మార్కులు బాగా పెరిగి, ఫలితాల్లో తేడా వస్తే కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతామనే భావన అధికారుల్లో ఉండటమే కారణంగా విశే్లషిస్తున్నారు. గత ఫలితాల్లో పరీక్ష ఫెయిలైన విద్యార్థులు ఈసారి ఫలితాల్లో పాసైతే అది మరింత వివాదాలకు దారితీస్తుందనే భావన కారణంగా విద్యార్థులకు న్యాయం జరగడం లేదని సమాచారం. ఈ నెల 8 వ తేదీన కోర్టు ముందు ఇంటర్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో బోర్డు అధికారులు వివాదాలు మరో మలుపు తిరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించి, స్కాన్డ్ జవాబుపత్రాలను మాత్రం మరో వారం తర్వాతనే విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు, ఇంటర్ ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ ప్రగతి- పురోగతి సరిగా లేక జరిగిన దురదృష్టకర సంఘటలకు బోర్డు పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ స్పష్టం చేశారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు లేని రీతిలో ఫలితాలు ఇస్తామని, రెండు ఏజన్సీల సహకారంతో పాటు జేఎన్‌టీయూహెచ్ నిపుణుల సహకారం కూడా తీసుకుంటున్నామని, కనకు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని బోర్డు కార్యదర్శి చెబుతున్నా, ఫలితాలు విద్యార్ధులు ఆశించిన రీతిలో లేవని సమాచారం. రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ తర్వాత మరో విద్యార్థులు భగ్గుమనే ముప్పు లేకపోలేదని అంటున్నారు. ఉద్యమాలతో విద్యార్థులకు నష్టం మూల్యాంకనంలో జరిగిన నష్టం కంటే ఉద్యమాలతోనే విద్యార్థులకు మరింత నష్టం వాటిల్లబోతోందని విద్యావేత్తలు విశే్లషిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి, విషయం న్యాయస్థానాల వరకూ వెళ్లకపోతే అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం జరిగేదని, ఇపుడు వివాదం న్యాయస్థానాల వరకూ వెళ్లడంతో బోర్డు తన తప్పిదాలను అంగీకరించే పరిస్థితి లేకపోయిందని వారు చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వం సైతం దీనిని సవాలుగా తీసుకోవడంతో మార్కులు విషయంలో బోర్డు రాజీపడటం లేదని, ఎవరికి ఎన్ని వస్తే అంత వరకూ వాల్యూయేషన్ ముగించాలని, మానవీయ కోణంలో ఆలోచించేందుకు అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు.
పెరుగుతున్న ఉద్యమాలు
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలూ తమ ఉద్యమాలను ఉద్ధృతం చేస్తున్నాయి. ఒక పక్క బీజేపీ రెండో దశ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించగా, విద్యార్థి సంఘాలు రేపటి నుండి నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి.