రాష్ట్రీయం

ఒకే విధమైన కనీస వేతన చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 11: దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఒకే విధమైన కనీస వేతన చట్టాన్ని అమలుచేయడానికి పార్లమెంటు సమావేశాల్లో చట్టాన్ని తీసుకురానున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని సాంబమూర్తినగర్‌లో గల ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐ) ఆసుపత్రిని ఆయన సోమవారం తనిఖీచేశారు. దేశంలో 40కోట్ల అసంఘటిత రంగ కార్మికులున్నారని, వారందరి సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 4 కోట్ల 70 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు వచ్చే ఆగస్టు నుండి ఇఎస్‌ఐ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, రిక్షా, ఆటో కార్మికులకు సైతం ఇఎస్‌ఐ ద్వారా వైద్య సేవలందించడానికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలో 8 కోట్ల 30 లక్షల మంది ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారన్నారు. హోమియో, ఆయుర్వేదం, యునాని, యోగా తదితర సేవలను కూడా ఇఎస్‌ఐ ద్వారా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో కార్మికులున్నారని, వారందరి సమస్యలను పరిశీలించిన పిమ్మట ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నదన్నారు. ఎపికి విజయవాడ కేంద్రంగా ఇఎస్‌ఐ ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. కార్మికులకు ఇచ్చే బోనస్‌ను రూ.3500 నుండి రూ.7000కు పెంచామని, 10వేలు వేతనంగా ఉన్న ఉద్యోగులకే కాకుండా 20వేలు వేతనంగా ఉన్న ఉద్యోగులందరికీ ఇఎస్‌ఐ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.200 ఉన్న సామాజిక భద్రత పింఛన్లను రూ.1000కి పెంచామని చెప్పారు. కాకినాడ ఇఎస్‌ఐ డిస్పెన్సరీని రానున్న రెండేళ్లలో 100 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. ఇఎస్‌ఐ ప్రాంతీయ సంచాలకుడు ఆర్‌ఎస్ రావు, ఇఎస్‌ఐ సంయుక్త సంచాలకుడు రవికుమార్, మెడికల్ కమీషనర్ కటారియా, కాకినాడ సిటీ శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు, సోషల్ సెక్యూరిటీ అధికారి శ్యామ్‌ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ పాణిగ్రాహి మంత్రి వెంట ఉన్నారు.