క్రైమ్/లీగల్

పుట్టిన రోజు వేడుకలకు డబ్బులివ్వలేదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మే 16: అసలే అంతంత మాత్రం ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబం అది. కుటుంబ పెద్దలు కూలీనాలీ చేస్తేనే ఇళ్లు గడిచేది. తాము ఇబ్బందులు పడినా కష్టనష్టాలకోర్చి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఇవేమి పట్టని కుటుంబ యజమాని పెద్దకుమారుడు తన పుట్టిన రోజు వేడుకలకు డబ్బులివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. తమ స్థోమతకు అనుగుణంగా నడుచుకోవాలని తల్లిదండ్రులు కుమారున్ని వారించారు. దీంతో క్షణికావేశానికి గురైన కుమారుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో చూడలేని తల్లిదండ్రులు కూడా అదే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా మారగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన గురువారం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో చోటుచేసుకుంది. మార్కాపురం సీ ఐ వై.శ్రీ్ధర్‌రెడ్డి కథనం మేరకు స్థానిక ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన మురారి గాలెయ్య ఒక హోటల్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఆయన తల్లి వెంకమ్మ కూడా ఆ ఇంట్లోనే ఉంటోంది. భార్య లక్ష్మీ కూలీ పనులకు వెళ్తుంటుంది. భార్యాభర్తలు కష్టం చేస్తేనే కుటుంబం గడిచేది. గాలెయ్య పెద్ద కుమారుడు ప్రసాద్‌ది గురువారం పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని, డబ్బులివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవాలని గాలెయ్య కుమారున్ని వారించాడు. కోపోద్రిక్తుడైన ప్రసాద్ బజార్‌కు వెళ్లి పెట్రోల్ తెచ్చుకున్నాడు. తనకు డబ్బుల్వికపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలని నిన్ను కన్నందుకు మేమే ఆత్మహత్య చేసుకుంటామంటూ తల్లిదండ్రులు గాలెయ్య, లక్ష్మీ ప్రసాద్ చేతిలోని పెట్రోల్ తీసుకుని వారిపై జల్లుకున్నారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన వాళ్లు అగ్గిపుల్ల గీసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో అక్కడేవున్న గాలెయ్య తల్లి వెంకమ్మ, కుమార్తె షాలినీ వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో అందరికీ గాయాలయ్యాయి. హాహకారాలు వినిపించడంతో గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే వారందరినీ హుటాహుటిన మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సలు నిర్వహించిన వైద్యులు గాలెయ్య తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గాలెయ్య భార్య లక్ష్మీ, తల్లి వెంకమ్మ, కుమార్తె షాలినీలకు మోస్తరు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఇంత జరిగినా క్షతగాత్రులైన వారంతా ఈ సంఘటనలో ప్రసాద్ తప్పేమిలేదని, అతని భవిష్యత్తుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున కేసులు వద్దని పోలీసులను వేడుకోవడం కొసమెరుపు. ఈ మేరకు మార్కాపురం టూటౌన్ ఎస్సై దీపిక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.