అటుఇటుకాని హృదయం తోటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదీష్, లిపి జంటగా జె.కె.జి.చౌదరి దర్శకత్వంలో లిపి బార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత డి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘అటు ఇటుకాని హృదయంతోటి’. మొదటి షెడ్యూల్ ప పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ, కథను నమ్మి సినిమా చేశానని, కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని, స్టార్స్ ఉన్నంతమాత్రాన సినిమా హిట్ అవ్వదని, ఒక అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నామని, హీరోహీరోయిన్లు నటనతో జీవం పోశారని, సినిమా బాగా వస్తోందని అన్నారు. ఈనెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిందని, ఇందులో ఐదు పాటలు ఉంటాయని, త్వరలోనే పాటలు విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ప్రవీణ్, కెమెరా:సునీల్.జి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జె.కె.జి.చౌదరి, నిర్మాతలు: డి.వి.కృష్ణమోహన్, ఆంజనేయులు.