Others

ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూలు ఫీజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోంలోని ఓ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలే ఫీజు. వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులే సేకరిస్తారు. ఒక్కో విద్యార్థి వారానికి కనీసం 25 బాటిల్స్ అయినా తేవాలి. ఇంతకీ స్కూలు పేరు చెప్పలేదు కదూ.. దాని పేరు అక్షర ఫోరమ్. అసోంలోని ఓ జంట ఈ స్కూల్‌ని నడుపుతోంది. పర్మితా శర్మ అనే మహిళ భర్తతో కలిసి పేద చిన్నారుల కోసం వెదురు గుడిసెల్లో ఈ స్కూల్‌ను స్థాపించింది. అక్కడ చలికాలంలో వెచ్చదనం కోసం ప్లాస్టిక్‌తో చలిమంటలు వేసుకుంటామని ఏదో సందర్భంలో విద్యార్థులు పర్మితాశర్మకు చెప్పారట. అప్పుడు పర్మితాశర్మ ప్లాస్టిక్‌లతో చలిమంట వేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని భావించి, స్కూలుకు వచ్చే విద్యార్థులకు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తేవాలనే నిబంధన పెట్టిందట. ఈ నిబంధన వల్ల ప్లాస్టిక్‌లను తగులబెట్టడం వల్ల కలిగే హాని గురంచి విద్యార్థులకు అవగాహన పెరిగిందని, చిన్నారులు వారి తల్లిదండ్రులకూ ఈ విషయం గురించి వివరిస్తున్నారని పర్మితా శర్మ చెబుతున్నారు. తెచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో పేపర్లను నింపి వాటిని ఇటుకల్లా చేసి సిమెంటును ఉపయోగించి గోడలను కడుతున్నారు విద్యార్థులు. అసోంలో ఈ స్కూలు మొదలుపెట్టకముందు, పేదరికంతో చాలామంది బడి మానేసి పనికి వెళ్లేవారట. కానీ ఈ స్కూలు మొదలుపెట్టాక వారు క్రమం తప్పకుండా స్కూలుకు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విద్యతో పాటు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ స్కూల్లో పెద్ద క్లాసుల విద్యార్థులు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పి గంటల లెక్కన సంపాదిస్తారు. ఇక్కడ వృత్తివిద్యా కోర్సులు కూడా ఉన్నాయి. ఈ స్కూల్లో చేరిన విద్యార్థులు సొంతకాళ్లపై నిలబడేలా వారు తగిన నైపుణ్యం పొందాలని పర్మితా శర్మ ఆకాంక్ష. త్వరలో పర్మితా శర్మ దీన్ని మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. చదువు పూరె్తైన వెంటనే విద్యార్థులు ఉద్యోగం చేయగలిగేలా ఉండాలన్నది ఆమె కోరిక. అందుకే ఇరవై మంది విద్యార్థులతో మొదలైన ఈ స్కూల్లో ఇప్పుడు వందమందికి పైగా చదువుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి స్కూల్స్ ప్రారంభించాలని పర్మితా శర్మ భావిస్తోంది.