రాష్ట్రీయం

ప్రయాణికుల రద్దీ... 94 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5; వేసవి సెలవులు ముగుస్తున్నందున ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకోవడానికి అనువుగా రద్దీని దృష్టిలో పెట్టుకుని ద.మ. రైల్వే అధికారులు 94 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 7 నుంచి 20 వతేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం - సికింద్రాబాద్ మధ్య ఈనెల 7, 14, 21, 28 తేదీలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్- హైదరాబాద్ మధ్య ఈనెల 7, 14, 21, 28 రైళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్- విజయవాడ మధ్య ఈనెల 8, 15, 22, జూలై 29 తేదీలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుపతి- నాగర్‌సోల్ మధ్య ఈనెల 12, 19, 26 తేదీల్లో... అలాగే, తిరుగు ప్రయాణంలో 13, 20, 27 తేదీలో రైళజూజను ఏర్పాటు చేశారు. హెచ్‌ఎస్ నాందేడ్- తిరుపతి మధ్య ఈనె 9, 16, 23, 30 తేదీల్లో రైళ్లను ఏర్పాటు చేశారు. కాచిగూడ- కాకినాడ మధ్య 12, 19, 26 తేదీల్లో నడుస్తాయి. కాకినాడ-కర్నూల్ మధ్య ఈనెల 9, 11, 16, 18, 23, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ- రాయచూర్ మధ్య ఈనెల 7, 10, 14, 17, 19, 21, 25, 27, 29 తేదీల్లో, తిరుపతి - కాకినాడ మధ్య ఈనెల 7, 14, 21, 28 తేదీలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.