ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై సర్కార్ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 9: రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం నిర్మాణం సహా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో వాటిపై విచారణ జరపాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్, హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి నియమ, నిబంధనలను ఇప్పటికే అధికారులు తిరగదోడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం సందర్భంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ల పనులు, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అంచనాలపై లెక్కలు తీస్తున్నారు. రాయలసీమకు నీరందించే హంద్రీ - నీవా, సుజల స్రవంతి, వెలుగొండ, గాలేరు - నగరి ప్రాజెక్ట్ పనుల పురోగతి, కాంట్రాక్టర్ల పనితీరు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పనుల్లో జాప్యం చేస్తున్న సంస్థలను పక్కనపెట్టాలనే యోచనతో సర్కారు ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఈఎన్‌సీ రోశయ్య నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ రాష్టవ్య్రాప్తంగా సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణ అంచనాలు, గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తాయనే అంశాలను నిశితంగా పరిశీలించి మూడునెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. జలవనరుల శాఖకు సంబంధించిన కీలక అంశాలపై కూడా ప్రభుత్వం ఓ కనే్నసింది. నిపుణులతో చర్చించిన అనంతరం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు, కాంట్రాక్టర్లు, అధికారుల అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైతే బాధ్యుల నుంచి రికవరీ చేసే దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు వినికిడి.