నిజంగా.. నాకు స్పెషలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అజయ్ కీలక పాత్రలో రంగ, అక్షత, సంతోష్ ముఖ్య పాత్రల్లో వస్తవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పెషల్. స్పెషల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటుడు అజయ్ చెప్పిన విశేషాలు..

అదే స్పెషల్..: ఇది సరికొత్త జోనర్‌లో తెరకెక్కిన థ్రిల్లర్. ఇందులో నేను ఇనె్వస్టిగేటివ్ పోలీస్‌గా కనిపిస్తాను. అవతలి వ్యక్తి చేతులు పట్టుకుని అతని గురించి చెప్పే స్పెషల్ క్వాలిటీ నా పాత్రకు ఉంటుంది. ఇందులో నేను మైండ్ రీడర్‌గా కనిపిస్తా. నిజంగా ఇది ఫాంటసీ అనుకోవచ్చు. కానీ దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు దీనిని జనాలు నమ్ముతారా అన్న అనుమానం కలిగి దర్శకుడిని అడిగితే అతను రిఫరెన్స్‌గా ఫ్రాన్స్‌లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఉన్నాడని ప్రూవ్ చేసాడు. దాంతో ఈ కథను నమ్మి చేశాను.
కొత్తగా ఉంటుంది..: సరికొత్త కథా, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుడికి ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. పైగా దర్శకుడు వస్తవ్ కొత్త అయినప్పటికీ ఎక్కడా గ్రిప్పింగ్ మిస్ అవ్వకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమాతో అతనికి దర్శకుడిగా మంచి ఇమేజ్ వస్తుంది.
నా పాత్ర..: ఇందులో నా పాత్ర చాలా రగ్గడగా, కేర్‌లెస్‌గా ఉంటూ.. డ్యూటీ మైండెడ్‌గా కనిపిస్తాను. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇదో డిఫరెన్స్.
ఏది ప్లాన్ చేయను..: నా కెరీర్‌పరంగా నేను ఏది ప్లాన్ చేసుకోలేదు. చాలా సినిమాలకు సెట్స్‌లోకి వెళ్లేవరకు నా పాత్ర ఇలా ఉంటుందన్న విషయం నాకే తెలియదు. అలా కుదిరాయి అంతే.. విక్రమార్కుడు తరువాత చాలా విలన్ పాత్రలు వచ్చాయి. అయితే విక్రమార్కుడిలా విలన్ కంటే ఇంకా ఎక్కువ భయపెట్టలేం... థీట్లా పాత్ర ఓ హైప్... దాన్ని మించిన పాత్రలులేవని నా ఫీలింగ్. ఆ తరువాత చాలా వచ్చాయి. అందులో నచ్చిన సినిమాలు చేశాను.
మధ్యలో గ్యాప్..: క్యారెక్టర్ యాక్టర్‌గాచేస్తున్న మధ్యలో సారాయి వీర్రాజు అంటూ రెండుమూడు హీరోగా ట్రై చేయడంవల్ల గ్యాప్ వచ్చింది. మళ్ళీ దారిలో పడటానికి కొంత టైం పట్టింది. ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటున్నా. ఈమధ్యలో కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేశా.
అన్నిరకాల పాత్రల్లో..: నా విషయంలో చాలామంది అంటున్నారు.. అజయ్ ఒక్క పాత్రలోనే చేస్తాడని చెప్పడం కష్టం అని. నిజంగా అది నా అదృష్టంగా భావిస్తా.. ఎందుకంటే కేవలం విలన్‌గానే చేస్తే జనాలకు బోర్ కొట్టేస్తాం.. అలా కాకుండా కామెడీ, ట్రాజెడీ, విలన్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న పాత్రల్లో దర్శకులు కూడా అవకాశం ఇస్తున్నారు. అందుకే అన్నిరకాలు ట్రై చేస్తున్నా.. అయితే ఇందులో విలన్‌గా సీరియస్ చేయడం ఈజీ కానీ కామెడీ చేయడమే కష్టం.
తదుపరి చిత్రాలు..: నితిన్ హీరోగా భీష్మ సినిమాతోపాటు, సరిలేరు నీకెవ్వరూ, సాయిధరమ్-మారుతీ సినిమాల్లో చేస్తున్నా. దాంతోపాటు కొరటాల శివ - మెగాస్టార్ సినిమా కూడా లైన్ ఉంది. అయితే నాని-విక్రమ్‌కుమార్ సినిమాలో చేయడం లేదు.