వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి కవుల రచన ప్రాచీన కవిత్వంమీద తిరుగుబాటు అనడంకంటే.. తిరుగమూత అనడం ఎక్కువ నిజమేమో అనిపిస్తుంది నాకు. (172 పే) అని చెప్పడంతో శ్రీపాద ఎంత వివేచనాపరులో అనిపిస్తుంది మనకి.
పద్యం ఎందుకు గురజాడ వదిలేశారు? తెలుగుభాస జీవం మాత్రాచ్ఛందస్సులోనే బయల్పడుతుందని సంస్కృత సమాసాలెందుకు వద్దన్నారు? తేట మాటలూ వ్యవహార పదాలూ వాడటంవల్ల వర్ణిత వస్తు సౌందర్యానికీ వర్ణన సౌందర్యానికీ సమ్మేళనం కోసం అన్నారు శ్రీపాద. పాత అలంకారాలు వదిలేశారు గురజాడ. ఇదీ తిరుగుబాటే. సందేశం ఇచ్చేందుకు సాహిత్యమనుకున్నారు గురజాడ. ఇలా నాలుగు దారుల్లో గురజాడ కొత్తదనాలను తెచ్చిపెట్టారని శ్రీపాద నిరూపించడంలో ఎంతో మెలకువగా చెప్పుకొంటూ పోయారు.
కృష్ణశాస్ర్తీ గారి తిరుగుబాటు వ్యక్తిగతమేనన్నారు. శ్రీపాద చదువరుల నాయనంతగా పట్టించుకోరనే వివాదం తవ్వి చూపించారు. స్వేచ్ఛ కోరే కళా సౌందర్య రసైక జీవి అని మాత్రం ఒప్పుకున్నారు శ్రీపాద.
అర్థశతాబ్దపు ఆంధ్ర కవిత్వం అనే ధారావాహిక వ్యాసాల్ని శ్రీపాద భారతి కోసం రాశారు. నెలనెలా వరుసగా 1962 నవంబరు నుంచి 1964 జనవరి దాకావచ్చాయని సమీకర్తసంజీవరావు గారిచ్చిన భోగట్టా. ఆ రోజుల్లో ఆ వ్యాసాలు చదివినవారిలో ఉండటమే కాదు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదివిన కాలమదే అయినందున వారిని వాల్తేరు పిలిపించుకుని ఒక ఉపన్యాసం తెలుగు శాఖ నిర్వహించడానికి కారకుడనయ్యాను నేను కూడా.
ఈ వ్యాసాలు చదువుతూంటే ఇవి ఉపన్యాసాలు కావా అనిపిస్తోందిప్పుడు. అంత ధారాశుద్ధి ఉంది ఈ వ్యాసాల్లో. వర్షాకాలంలో గోదావరీ కృష్ణా వరదల్ని చూస్తున్నామా అన్నంత పరుగుతో సాహిత్య చరిత్ర సాగడం ఎక్కడా కనిపించదు. ఇక్కడ అది అతిశయోక్తి కాదు.
శ్రీపాద సాహిత్య చరిత్ర తారీఖుల దస్తావేజుల కేటలాగుల సంగ్రహ వ్యాఖ్యల పద్ధతిలో కాక వివరణతో, విమర్శతో విశే్లషణతో అవగాహనతో కార్యకారణ వివేచనతో నడిచి థీసిస్సులా ఇలా ఉండాలనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.
శ్రీపాద చూపుకి కొందరు శిఖరాల్లా కనిపించారు. గురజాడ, రాయప్రోలు, అబ్బూరి, దువ్వూరి, బసవరాజు, కవికొండల, అడివి, పింగళి, కాటూరి, నాయని, నండూరి, కృష్ణశాస్ర్తీ, వేదుల, శివశంకరులూ, శ్రీశ్రీల పేర్లతో వ్యాసాల శీర్షికలు రూపుదిద్దుకున్నాయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

మిరియాల రామకృష్ణ