రాష్ట్రీయం

టీటీడీ చైర్మన్‌గా వైవీ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 22: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలనా పాలనా చూసే పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11.47 నిమిషాలకు గరుడాళ్వార్ సన్నిధి వద్ద బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ 50వ చైర్మన్‌గా వై.వీ.సుబ్బారెడ్డిని నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జీఓ విడుదలైన వెంటనే ఆయన సాయంత్రం 6 గంటలకు విమానంలో కుటుంబ సమేతంగా రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 11 గంటలకు అతిథి భవనం నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని అక్కడ నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాస రాజు, తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం ఆయనకు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకువెళ్లారు. గరుడాళ్వార్ సన్నిధి వద్ద టీటీడీ ఈఓ ఏకె సింఘాల్ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి వైభవాన్ని, ఆభరణాల విశిష్టతను వివరించి టీటీడీ తరపున శేష వస్త్రాన్ని బహుకరించారు. అనంతరం ఆయన వకుళామాత అమ్మవారిని దర్శించుకుని సంపంగి ప్రాకారం చుట్టూ తిరిగి విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి ధ్వజ స్థంభానికి ప్రదక్షణ చేసుకుని రంగనాయకుల మండపం చేరుకున్న వై.వి.సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈఓ ఏకె సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, లక్ష్మీకాంతం ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలావుండగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారికి తులాభారం ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. 70 కేజీల తన బరువుకలిగిన ఒక్కొక్క వస్తువును తులభారంగా ఇచ్చారు. ఇందులో పెద్దకలకండ, చిన్న కలకండ, బెల్లం, బియ్యం, నెయ్యి, నవధాన్యాలతో కలిపి మొక్కులు తీర్చుకున్నారు. కాగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వై.వి.సుబ్బారెడ్డి ఆలయం నుంచి నేరుగా టీటీడీ అన్నప్రసాద భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాల నాణ్యత, రుచి, అందుతున్న సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కూడా అన్నప్రసాదం స్వీకరించారు. ఆయన వెంట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు, అలాగే సినీ నిర్మాత దిల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా టీటీడీ చైర్మన్ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని సినీనటి రమ్యశ్రీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నారు. అయితే విఐపీల జాబితాలో ఆమెపేరు లేకపోవడంతో సిబ్బంది ఆమెను నిరాకరించినట్లు సమాచారం.

చిత్రం...టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డికి శ్రీవారి ఫొటో, ప్రసాదాన్ని అందిస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్